చంద్రబాబు కి హ్యాండ్ ఇచ్చి తనవైపు వస్తున్నాడు అనుకున్న లీడర్ జగన్ కే రివర్స్ అయ్యాడు ?

2019 ఎన్నికల తరువాత టీడీపీలో ఉన్న చాలామంది నేతలు వైసీపీ బాట పడుతున్నారు. ఇప్పటికే వల్లభనేని వంశీ, వాసుపల్లి గణేష్ లాంటి నేతలు వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. అయితే ఇప్పుడు వైసీపీలోకి వస్తున్నాడని అనుకున్న బాపట్ల పార్లమెంటరీ టీడీపీ అధ్యక్షుడు ఏలూరి సాంబశివరావు వైసీపీపై ఆసక్తి కరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి టీడీపీను నిందిస్తుందని వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో కేవలం కక్ష్యపూరితమైన పాలన తప్ప మరేమీ జరడగం లేదని వెల్లడించారు. ఇప్పటికే లోటు బడ్జెట్ లో రాష్ట్రం నడుస్తుందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యొక్క అసమర్థ పాలన వల్లే రాష్ట్రానికి ఈ పరిస్థితి పట్టిందని పేర్కొన్నారు.

yeluri sambhashiva rao
yeluri sambhashiva rao

ఎన్ని అడ్డంకులు ఎదురైన గత ప్రభుత్వ హయాంలో ఒకటవ తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లించామని తెలిపారు. ప్రజలను మభ్యపెట్టడానికే టీడీపీ గతంలో టీడీపీ ప్రభుత్వం లక్ష కోట్ల అప్పు చేసిందని అబద్ధాలు చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జలాశయాలు నిండా నీళ్లు ఉన్నా కూడా రైతులకు ప్రభుత్వం నీళ్లు అందించడం లేదని, గిట్టుబాటు ధరలు లేకుండా రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అలాగే రైతులకు చెప్పకుండానే పొలాల్లో మోటర్స్ బిగిస్తున్నారని, ఉచిత వ్యవసాయ విద్యుత్ ను తొలగించడానికి వైసీపీ ప్రభుత్వం పూనుకుందని వెల్లడించారు.

ప్రభుత్వం సరైన ప్రణాళిక లేకుండా ముందుకు వెళ్తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తుందని, టీడీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు అర్ధాంతరంగా మధ్యలోనే నిలిపివేశారనీ మండిపడ్డారు. సామాన్యులను ప్రభుత్వం పీల్చి పిప్పి చేస్తుందని, ప్రతీ రంగం నిర్వీర్యం అయిపోతున్నా పట్టించుకునే పరిస్థితి లేదనీ ఆరోపించారు. ఏ కులాన్ని అడ్డం పెట్టుకుని ఓట్లు సంపాదించారో ఆ వర్గాల నుండే ప్రభుత్వంపై తిరుగుబాటు వస్తుందని, గ్రానైట్ రంగాన్ని ప్రభుత్వ ఆదాయ వనరుగా చూడకుండా ఆ రంగంలో ఉన్న ప్రత్యర్ధులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారని విమర్శించారు. తన పంచన చేరుతాడని అనుకున్న నేత ఇలా ఎదురుతిరగడంతో వైసీపీ నేతలు ఆశ్చర్యపోతున్నారు.