AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి చేసుకుంది ఈ క్రమంలోనే తొలి ఏడాది సుపరిపాలన అంటూ ఇటీవల ఓ కార్యక్రమాన్ని కూడా కూటమి ప్రభుత్వం ఎంతో ఘనంగా నిర్వహించింది. ఇకపోతే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ కొంతమంది కీలక నేతలు మాజీ మంత్రులు తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి రాబోతున్నారంటూ వార్తలు వినిపించాయి. ముఖ్యంగా టిడిపిలో మంత్రిగా పనిచేసిన దేవినేని ఉమా గత ఎన్నికలలో ఎక్కడ కూడా ఈయనకు పోటీ చేసే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు కల్పించలేదు దీంతో ఈయన గత ఎన్నికలకు దూరంగా ఉన్నారు.
పార్టీలో తనకు పూర్తిస్థాయిలో ప్రాధాన్యత తగ్గించిన నేపథ్యంలో మనస్థాపానికి గురి అయిన దేవినేని ఉమా టిడిపి నుంచి వైసీపీలోకి రాబోతున్నారంటూ జోరుగా ప్రచారం సాగింది అయితే ఈ వార్తలపై దేవినేని ఉమా స్పందించి క్లారిటీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ… ప్రజలు వైసిపికి 11 సీట్లు ఇచ్చినా ఇంకా బుద్ధి రాలేదని తెలిపారు.వైఎస్ జగన్ ఫేక్ ప్రచారాలు మానలేదు. నీ పార్టీ ఉనికి కాపాడు కోవడం కోసం ఇంతలా దిగజారాలా? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్‌ల ఏడాది సుపరిపాలనా తీరుతో జగన్ వెన్నులో వణుకు మొదలైంది. ఇటువంటి తప్పుడు పనులు మానకపోతే 2029 లో వైసీపీ సింగిల్ సీటు గెలుచుకోవడం కూడా కష్టమే అంటూ మాజీ మంత్రి దేవినేని చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.
దేవినేని ఉమా మొదటి నుంచి కూడా టిడిపి పార్టీలోనే ఉన్నారు. 1999లో ఆయన నందిగామ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి విజయం సాధించారు. 2004లో కూడా నందిగామలో రెండోసారవి గెలుపొందారు. అయితే 2009 ఎన్నికల నాటికి నందిగామ ఎస్సీ నియోజకవర్గం కావడంతో ఆయన నియోజకవర్గం మారారు. 2009 ,2014ఎన్నికల్లో మైలవరం నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. ఇక 2019 సంవత్సరంలో కూడా మైలవరం నియోజకవర్గం నుంచి పోటీ చేశారు కానీ ఓటమిపాలయ్యారు 2024 లో పొత్తులో భాగంగా ఈయన టికెట్టును కోల్పోవలసి వచ్చింది. దీంతో ఈయన పార్టీ మారబోతున్నారని వార్తలు బయటకు వచ్చాయి.