ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. వైసీపీ కార్యకర్తలు ప్రతి గ్రామంలో కూడా అంగరంగ వైభవంగా జగన్ పుట్టిన రోజు వేడుకలు నిర్వహిస్తున్నారు. ఇక సోషల్ మీడియా లో అయితే గత రెండు మూడు రోజుల నుండి హ్యాపీ బర్త్డే జగన్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది.
అయితే ఈరోజు మాత్రం ట్విట్టర్ వేదికగా జగన్ అభిమానులకు భారీ షాక్ తగిలింది. తమ ప్రియతమ నేతను ట్విట్టర్ లో ట్రేండింగ్ చేద్దామని అనుకుంటున్నా అభిమానులకు #HBDFAKECM అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ ఊహించలేని షాక్ ఇచ్చింది. #HBDYSJAGAN అనే ట్యాగ్ కంటే కూడా ఫేక్ సీఎం అనే ట్యాగ్ టాప్ లో ఉండటం వైసీపీ శ్రేణులకు మింగుడు పడటం లేదు.టీడీపీ పార్టీ కావచ్చు, ఆయా నేతలు కావచ్చు మొదటి నుండి జగన్ ను ఫేక్ సీఎం అంటూ సంబోధిస్తుంటారు. ఈ రోజు దానినే హ్యాష్ ట్యాగ్ గా పెట్టి ట్విట్టర్ లో టాప్ ట్రేండింగ్ లోకి వచ్చేలా చేసి వైసీపీ కి పెద్ద షాక్ ఇచ్చారు.బహుశా వైసీపీ శ్రేణులు కూడా దీనిపై పెద్దగా దృష్టి పెట్టి ఉండకపోవచ్చు.
నిజానికి సోషల్ మీడియాలో వైసీపీకి గట్టి పట్టు ఉంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు వెనుక సోషల్ మీడియా వారియర్స్ కృషి తక్కువ చేయటానికి లేదు. ప్రత్యేకంగా జగన్ కు వారి గురించి మాట్లాడటం జరిగింది. మరోపక్క విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియా సైన్యం కోసం అనేక వరాల కూడా ప్రకటించటమే కాకుండా మొన్న ఈ మధ్య తాడేపల్లిలో ఒక ప్రత్యేక సమావేశం కూడా ఏర్పాటు చేసి, మీకేమి భయం లేదని హామీ కూడా ఇచ్చాడు.
ఇలాంటి నేపథ్యంలో సోషల్ మీడియాలో వైసీపీ హవా ఎక్కువగా కనిపించాలి. అది లేకపోగా దారుణంగా ఫేక్ సీఎం అనే ట్యాగ్ టాప్ ట్రెండ్ అవుతున్న కానీ దానిని వెనక్కి నెట్టి సత్తా వైసీపీ సోషల్ మీడియా వారియర్స్ కి లేకపోవటం విడ్డురం. పార్టీ కోసం పనిచేసే వైసీపీ శ్రేణులు తగ్గిపోయారా..? లేక టీడీపీ పార్టీ సోషల్ మీడియాలో తన బలం పెంచుకుందా అనేది అర్ధం కావటం లేదు. ఫైనల్ గా మాత్రం జగన్ పుట్టినరోజు నాడు టీడీపీ శ్రేణులు మాత్రం ట్విట్టర్ ద్వారా జగన్ కు భారీ గిఫ్ట్ ఇచ్చారనే చెప్పాలి