టీడీపీకి సెంచరీపై ఆశల్లేవ్.! కానీ, అధికారంపై నమ్మకముంది.!

TDP Chief CBN

TDP Chief CBN : ‘మేం 160 స్థానాల్లో గెలుస్తాం..’ అంటోంది తెలుగుదేశం పార్టీ. అసలు మీకు అన్ని స్థానాల్లో పోటీ చేయడానికి అభ్యర్థులున్నారా.? అని అధికార వైసీపీ ఎగతాళి చేస్తోంది. రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయ్. 2014 నాటి పరిస్థితులకీ, 2019 ఎన్నికల నాటి పరిస్థితులకీ చాలా తేడా.

వైసీపీ అంతర్గత సర్వేల్లో 60 శాతానికి పైగా ఎమ్మెల్యేలు ఓడిపోతారని తేలినట్టుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత, తమ పార్టీ శాసన సభ్యులకీ, మంత్రులకీ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. గడప గడపకీ వైఎస్సార్సీపీ.. అంటూ వైఎస్ జగన్ నినదిస్తున్నది ఇందుకే.

ఇక, టీడీపీ కూడా జనంలోకి వెళుతోంది. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు పర్యటనల్లో జోరు పెంచారు. ఇంకోపక్క ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కూడా తన పని తాను చేసుకుపోతున్నారు.

ఇంతకీ, 2024 ఎన్నికలపై టీడీపీ టార్గెట్ ఏంటి.? అంటే సెంచరీ కొట్టడం కష్టమేనన్న అభిప్రాయం ఆ పార్టీలో వుందట. ముక్కోణపు పోటీ 2024 ఎన్నికల్లో తప్పదని టీడీపీ భావిస్తోందట. అదేంటీ, జనసేన – టీడీపీ – బీజేపీ కలిసి పోటీ చేస్తాయి కదా.? అంటే, ఆ కాంబినేషన్ పట్ల చంద్రబాబు పెద్దగా ఆసక్తి చూపడంలేదట.

వైసీపీ ఓటు బ్యాంకుని జనసేన పూర్తి స్థాయిలో కొల్లగొడుతుందనే అభిప్రాయానికి చంద్రబాబు వచ్చారట. తమ ఓటు బ్యాంకు తమకే వుంటుందని చంద్రబాబు నమ్మకంతో వున్నారట. కానీ, ఇది సాధ్యమయ్యే ఈక్వేషనేనా.? అన్న అనుమానాలు టీడీపీ నేతల్లోనే చాలామందిలో వున్నాయి.

ముక్కోణపు పోటీలో ముగ్గురికీ సమస్యలు తప్పవనీ, అప్పుడు ఈక్వేషన్స్ ప్రకారం హంగ్ ఏర్పడితే, ఆ తర్వాత జనసేనను తమవైపుకు తిప్పుకోవాలన్నది చంద్రబాబు తాజా వ్యూహంగా కనిపిస్తోంది.