‘చంద్రబాబు’ ను రెండేళ్లు తమ జోలికి రావద్దంటున్న తెలుగు తమ్ముళ్లు

Amaravati Scam: Relief to Chandrababu as AP HC stays CID Probe

టీడీపీ అధినేత చంద్రబాబుకు స్థానికసంస్థల ఎన్నికలు పెనం మీద నుంచి పొయ్యి మీద పడేలా చేశాయి. స్థానిక సంస్థల ఎన్నికలను చంద్రబాబు గట్టిగా కోరుకున్నారు. ఎందుకంటే రెండేళ్ల జగన్ పాలనపై వ్యతిరేకత ఉంటుందని చంద్రబాబు అంచనా వేశారు. కానీ బెదిరింపులో బతిమాలో ఎన్నికల్లో టీడీపీకి వైసీపీ చుక్కలు చూపించింది. ఎంత సమర్థించుకున్నా చంద్రబాబుకు ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దిగజారే అవకాశముందన్న ఆందోళన ఉంది.

chandrababu-bluff-statements-about-ap-municipal-elections

ఇప్పటికే రెండేళ్ల నుంచి కీలక నేతలు ఎవరూ బయటకు రావడం లేదు. ఇప్పటి వరకూ అక్కడక్కడా బయటకు వస్తున్న స్థానిక సంస్థల ఫలితాల తర్వాత మొహం చాటేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పట్లో ఎలాంటి ఎన్నికలు లేవు. మరో మూడేళ్ల పాటు జగన్ పాలనను అంగీకరించాల్సిందే. ఇప్పటికే ఆర్థికంగా నష్టపోయిన తమను మరింత ఇబ్బంది పెట్టవద్దని చంద్రబాబును నేరుగా నేతలను కోరే అవకాశముంది. ఇక జిల్లాల్లో ఎలాంటి కార్యక్రమాలను ఏర్పాటు చేసినా నేతలు ముందుకు రాకపోవచ్చు. ఇప్పటికే టీడీపీ ప్రోగ్రాం కమిటీ ఇస్తున్న కార్యక్రమాలతో నేతలు విసిగిపోయి ఉన్నారు.

ఒక్క కార్యక్రమానికి దాదాపు రెండు లక్షల నుంచి ఐదు లక్షల వరకూ ఖర్చు అవుతుండటంతో నేతలు కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడం లేదు. ధర్నా వంటి కార్యక్రమాలుకు కూడా ముఖ్యమైన వారినే పిలిచి ఒక గంటపాటు సేపు చేసి మమ అనిపిస్తున్నారు. దీనికితోడు చంద్రబాబు నాయకత్వంపై ఇప్పటికీ కొందరు నేతలకు నమ్మకముంది. ఆయనే వచ్చే ఎన్నికల్లో పార్టీని గట్టెక్కిస్తారన్న అభిపప్రాయంలో ఉన్నారు. అలాగని మరో రెండేళ్ల పాటు తమ జోలికి రావద్దని నిర్మొహమాటంగా నేతలు చెప్పే అవకాశముంది. ఎన్నికలకు ముందు ఆరు నెలల పాటు కష్టపడితే విజయం సాధించవచ్చన్న ధీమాలో ఎక్కువ మంది టీడీపీ నేతలున్నారు. మరో రెండేళ్ల పాటు చంద్రబాబు ఎన్ని ఫీట్లు చేసినా నేతల నుంచి రెస్పాన్స్ వస్తుంన్నది అత్యాశమాత్రమే.