రేట్లు పెరిగితే.. టీడీపీ అను’కుల’ మీడియాకెందుకు ఏడుపు.?

TDP

మీడియా వున్నది దేనికి.? ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి. ప్రభుత్వాలెలాగూ ప్రజాధనాన్ని ఖర్చు చేసి మరీ పబ్లిసిటీ చేసుకుంటున్నాయి.. తాము చేస్తోన్న పనుల్ని. మీడియా పని, ప్రభుత్వంలోని లోటుపాట్లను ఎత్తి చూపడమే. అలాగని, సమస్య వున్నా.. లేకపోయినా.. ఏదో ఒక విమర్శ చేయాలనుకుంటే ఎలా.?

వైఎస్ జగన్ సర్కారు, రాష్ట్రంలో రోడ్లకు ఆనుకుని వున్న భూముల ధరలు పెంచాలని నిర్ణయించుకుందట. నిజానికి, రోడ్డుకు దూరంగా వున్న స్థలాల రేట్లతో పోల్చితే, రోడ్లకు ఆనుకుని వున్న స్థలాల రేటు ఎక్కువగానే వుంటుంది. ఇందులో వింతేమీ వుండదు. కానీ, ప్రభుత్వం రేట్లు పెంచి, ఆదాయం పెంచుకోవాలన్న ఆలోచన చేయడం టీడీపీ అనుకూల మీడియాకి తప్పుగా కనిపిస్తోంది.

ప్రభుత్వ ఖజానా నిండితే, ఆ ఖజానా నుంచే అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేయడానికి మరింత వెసులుబాటు దొరుకుతుంది. భూముల రేట్లు పెరగడం వల్ల సామాన్యుల మీద కొంత భారం పడే అవకాశమైతే లేకపోలేదు. కానీ, ప్రభుత్వ ధరల కంటే, మార్కెట్ ధరలు చాలా ఎక్కువగా వుంటాయ్. సో, ప్రభుత్వం ధరలు పెంచడం వల్ల నష్టపోయేది సామాన్యులు కాదు, రియల్ వ్యాపారులు మాత్రమే.

ఇది తెలియనంత అమాయకత్వం అయితే టీడీపీ అను’కుల’ మీడియాలో వుంటుందని అనుకోలేం. వెరసి, ఈ వ్యవహారంతో టీడీపీ అను’కుల’ మీడియా బొక్కబోర్లా పడిందనే చెప్పక తప్పదు. వైసీపీ మీద విమర్శలు చేద్దామనుకునే క్రమంలో టీడీపీ అను’కుల’ మీడియానే పలచనైపోయింది.