AP: ఇటీవల తెలుగుదేశం పార్టీ యువనేత మంత్రి నారా లోకేష్ పుట్టిన రోజు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు లోకేష్ పుట్టినరోజు సందర్భంగా పెద్ద ఎత్తున వేడుకలను నిర్వహించారు. ఈ క్రమంలోనే తాడేపల్లిలో వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున వాహనాలలో జగన్ ఇంటి వద్దకు వెళ్లి అక్కడ హల్చల్ చేశారు.
పెద్ద ఎత్తున కార్లు బైకులతో ర్యాలీగా వెళ్లిన అభిమానులు జగన్ ఇంటిముందు హారన్ కొడుతూ కేకలు వేస్తూ హల్చల్ చేశారు. అనంతరం తమ యువ నాయకుడు పుట్టినరోజు వేడుకలు సందర్భంగా అక్కడికే కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇలా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అభిమానులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు హల్చల్ చేస్తున్నారన్న విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు చేరుకొని టీడీపీ శ్రేణులకు దీటుగా నినాదాలు చేసే ప్రయత్నం చేయగా.. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకున్నారు. రణరంగంగా మారే అవకాశం ఉండడంతో రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి నుంచి రెండు పార్టీ కార్యకర్తలను శ్రేణులను తిరిగి వెనక్కి పంపించారు.
ఇలా ఉన్నఫలంగా టిడిపి శ్రేణులు జగన్ ఇంటి వద్దకు వచ్చి హల్చల్ చేయడంతో ఉద్దేశపూర్వకంగానే అక్కడికి చేరుకొని ఇంటిపై దాడికి ప్రయత్నాలు చేశారని తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. అయితే ఈ ఇంటిలో ప్రస్తుతం జగన్ లేరని విషయం మనకు తెలిసిందే. ఈయన తన కుటుంబంతో కలిసి లండన్ పర్యటనలో ఉన్నారు.
