అయ్యయో చంద్రబాబు గారికి వస్తున్న కష్టాలు చూసి సగటు టీడీపీ నాయకుల మతులు భ్రమిస్తున్నాయా ? ఒకవైపు అవినీతి ఉచ్చు.. మరో వైపు పరపతి లేని పదవి, అసలు ఏపీలో ఎక్కడా వీరి మాట చెల్లడం లేదట.. ఇలా టీడీపీ అధినేత చుట్టు బిగుస్తున్న ఉచ్చుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎక్కువగా టెంప్ట్ అవుతున్నారా అనే అనుమానాలు ఏపీ ప్రజల్లో కలుగుతున్నాయట.. ఇలాంటి అనుమానాలు ఎందుకు వస్తున్నాయంటే.. వైసీపీ నాయకుల మీద టీడీపీ నాయకుల దాడులు ఈ మధ్యకాలంలో పెరిగిపోతున్నాయి కదా.. కడుపు మంటతో చేస్తున్న ఈ పనుల వల్ల ఆ పార్టీ మరింతగా దిగజారుతుందన్న విషయాన్ని టీడీపీ పెద్ద గమనించడం లేదా.. లేక సమాధానం చెప్పడానికి మాటలు రావడం లేదా అని అనుకుంటున్నారట సగటు మనుషులు..
ఇకపోతే ఆమధ్య దళిత శంఖారావం పేరుతో వీడియో కాన్ఫరెన్స్ లు పెట్టి రాష్ట్రంలో దళితులపై దాడులు పెరిగిపోతున్నాయంటూ మొసలి కన్నీరు కార్చిన చంద్రబాబుకు ఆయన టీమ్ దళిత ప్రజా ప్రతినిధులపై చేస్తున్న దాడులు కనిపించడం లేదా అంటు ప్రశ్నిస్తున్నారు.. అదీగాక గత కొంతకాలంగా అమరావతి ఉద్యమకారుల పేరుతో టీడీపీ కార్యకర్తలు పదే పదే దళిత ప్రజా ప్రతినిధులైన నందిగం సురేష్, ఉండవల్లి శ్రీదేవిని టార్గెట్ చేస్తూ వస్తున్నారు.. ఈ నేపధ్యంలో తాజాగా నందిగం సురేష్ పై దాడి యత్నం టీడీపీ వర్గాల దౌర్జన్యానికి పరాకాష్టగా మారిందంటు దళిత సంఘాలు ఆక్రోశిస్తున్నాయి..
గుంటూరు జిల్లా బాపట్ల వైఎస్సార్‌సీపీ ఎంపీ నందిగం సురేష్, ఉద్దండరాయునిపాలెంలో ఉన్న తన నివాసం నుంచి బైటకు వెళ్లేందుకు కారులో బయలుదేరుతున్న సమయంలో టీడీపీ కార్యకర్తలైన బత్తుల పూర్ణచంద్రరావు ఆయనపై దాడికి ప్రయత్నించారట. ఒక్కసారిగా బైక్ పై దూసుకొచ్చి కారుకి అడ్డంగా నిలిపి, ఇనుపరాడ్ తో దాడి చేయబోయారట. వెంటనే అప్రమత్తమైన సురేష్ సెక్యూరిటీ ఆ దాడిని ఆపారు. ఆ తర్వాత వారినుంచి తప్పించుకున్న పూర్ణచంద్రరావు సమీపంలోని అమరావతి జేఏసీ నాయకుడు పులి చిన్న ఇంట్లో దాక్కునేందుకు ప్రయత్నించగా, సెక్యూరిటీ అతడ్ని వెంటబడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
ఈ ఘటనతో ఉలిక్కిపడిన దళిత నాయకులు ఓవైపు దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని మాట్లాడే చంద్రబాబుకి, దళిత ప్రజా ప్రతినిధులపై జరుగుతున్న దాడులు కనిపించవా. సాక్షాత్తూ టీడీపీ కార్యకర్తే ఎంపీపై దాడి చేసేందుకు వచ్చి అడ్డంగా దొరికిపోయారు. అసలు ఇప్పుడు బాబు ఏమని సమాధానం చెబుతారంటూ ప్రశ్నల మీద ప్రశ్నలు సంధిస్తున్నారట.. ఇక దిగజారిపోతున్న టీడీపీ కార్యకర్తలను వారింపకుండా, తప్పు చేస్తూ అడ్దంగా దొరికిన వారిపట్ల చర్యలు తీసుకోకుండా కాలయాపన చేస్తున్న టీడీపీ అధినేత ఇప్పుడైనా స్పందిస్తారా లేదా చూడాలి అంటూన్నారట ఈ విషయం తెలిసిన వారు..