Omicron Diet: ఈ ఆహార పదార్థాలు తీసుకోవటంవల్ల ఒమిక్రాన్ నుండి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు..!

Omicron Diet: ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఇటువంటి సమయంలో ప్రజలు వారి ఆహారపు అలవాట్లలో జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధినిరోధక శక్తి ఎక్కువగా ఉండటం వల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరవు. కరోనా సోకిన వారు ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల కరోనా తొందరగా వ్యాపిస్తుంది. అందువల్ల ఇమ్యూనిటీపవర్ పెంచటానికి మంచి పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల కారణంగా హోటల్ లో, రెస్టారెంట్లలో తినకుండా ఇంట్లో ఆహారాన్ని వండుకొని తినటం శ్రేయస్కరం. ఆకుకూరలు కూరగాయలు వంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
శరీరాన్ని ఎప్పుడు హైడ్రేటెడ్ గా ఉండేలా చూసుకోవాలి. తరచూ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా ఉంటుంది. ప్రస్తుతం అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది గ్రీన్ టీ ,హెర్బల్ వంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ,యాంటీబ్యాక్టీరియల్ లక్షణాల వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరిగి ఎటువంటి ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.
మన ఇంట్లో ఉపయోగించే పప్పుదినుసులు తినడం వల్ల వాటిలో ఉన్న పోషకాలు మన ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

కరోనా సోకిన వారు ఆల్కహాల్కు దూరంగా ఉండటం వారి ఆరోగ్యానికి చాలా మంచిది. మద్యపానం వల్ల శరీర ఆరోగ్యం క్షీణిస్తుంది. కరోనా ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధి . ఆల్కహాల్ తీసుకోవటంవల్ల శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తి హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఉంది. మద్యపానం సేవించడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా మొదలవుతాయి.

కరోనా సోకిన వారు ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్ వంటి వాటినీ తినకపోవడం శ్రేయస్కరం. ప్యాకేజ్డ్ ఫుడ్ నీ కూడా తీసుకోకపోవడం మంచిది. ప్యాకేజ్డ్ ఫుడ్ తినటం వల్ల వ్యాధి తీవ్రత ఇంకా ఎక్కువ అయ్యే ప్రమాదం ఉంది.కరోనా సోకిన వారు వారు తీసుకునే ఆహారంలో ఉప్పు ,కారం మితంగా ఉండేలా చూసుకోవాలి. ఇదే కాకుండా మాస్కులు ధరించడం, శానిటైజర్ వాడటం, సామాజిక దూరం పాటించడం వంటి నియమాలు తప్పనిసరిగా పాటించాలి.