రాజకీయాల్లో కులాలు, మతాల ప్రస్తావన ఉండకూడదు, ఎన్నికల్లో పోటీ చేసే నాయకుల పేర్ల చివర ఉన్న కులాల ట్యాగ్స్ ఉండకూడని, ఎలాంటి మత పెద్దలు రాజకీయాల్లో ఉండకూడదనే వాదన ఎప్పటి నుండి ఉంది కానీ ఆ వాదనను ఎవ్వరు పట్టించుకోరు. కులాల పేరుతో, మతాల పేరుతో, స్వామిజీల పేరుతో, ప్రాంతాల పేరుతో రాజకీయాలు చేస్తూ, అధికారం కోసం కుక్కల్లా పాకులాడే నాయకులు చాలామంది ఉంటారు. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ఒక స్వామీజీ వ్యక్తుల దోషాలను తొలగించి వ్యక్తిని ఉన్నత శిఖరాలకు చేర్చడమే కాకుండా రాజకీయల పార్టీల మధ్య నున్న విభేదాలను కూడా తొలగించి రాజకీయ పార్టీల యొక్క ఉన్నతికి కూడా తోడ్పడుతూ, పరిపాలనా విధానాన్ని ప్రక్షాళన చేస్తున్నారని సమాచారం. ఆ స్వామీజీ ఎవరంటే స్వరూపానంద స్వామి.
బీజేపీ -వైసీపీని కలపనున్న స్వరూపానంద స్వామి
ఈమధ్య కాలంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చాలా తరుచుగా ఢిల్లీ వెళ్తున్నారు. ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం వెళ్తున్నారని కొంతమంది చెప్తుండగా, మరికొంత మాత్రం ఆయన స్వామీజీ చెప్పడం వల్లే ఢిల్లీ వెళ్తున్నారని చెప్తున్నారు. వైసీపీతో కలవడానికి బీజేపీ ఎప్పటి నుండి ప్రయత్నిస్తుంది.
ఇప్పుడు ఆ ప్రయత్నాలను స్వామీజీ మూలంగా కేంద్ర బీజేపీ పెద్దలు నడిపిస్తున్నారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. స్వామీజీ అంటే జగన్ కు చాలా ఇష్టం కాబట్టి ఆయన చెప్తే జగన్ కాదరని భావించిన బీజేపీ నేతలు ఈ ప్రయత్నాలు మొదలు పెట్టారని సమాచారం.
జగన్ కు స్వామీజీ అవసరం ఏంటి ?
ఆంధ్రప్రదేశ్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంత పెద్ద రాజకీయ శక్తో అందరికి తెలుసు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఒక స్వామీజీ చెప్పిన మాటలు వినాల్సిన అవసరం లేదు. ఆయన చెప్పినట్టు ఆడాల్సిన అవసరం లేదు. జగన్ కు ప్రజలు ఓట్లు వేసింది ఈ స్వామీజీ చూసో, కులాన్ని చూసో, మతాన్ని చూసో కాదు, ఆయనలో ఉన్న పట్టుదల, గత ప్రభుత్వంపై ఉన్న విముఖత జగన్ కు ఓటు వేసేలా చేసింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీజేపీకి జగన్ అవసరం ఉంది కానీ జగన్ బీజేపీ అవసరం అస్సలు లేదు. ఒకవేల్ బీజేపీ నాయకులు జగన్ పై కేసుల విషయంతో ఇబ్బందులకు గురి చేసినా జగన్ కు పోయేది ఏమి లేదు ఎందుకంటే జగన్ పై కేసులు ఉన్నాయని, ఆయన జైల్ కు వెళ్లారని తెలిసి కూడా ప్రజలు ఓట్లు వేశారు.ఇప్పుడు మళ్ళీ కేసులతో జగన్ పై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని బీజేపీ తొలగించలేదు.