Crime News: హాస్టల్ గదిలో ఐఐటీ విద్యార్థి అనుమానాస్పద మృతి.. చదువుల ఒత్తిడి కారణమా?

Crime News: ప్రస్తుత కాలంలో యువత ఏ చిన్న సమస్య వచ్చినా కూడా దానిని పరిష్కరించి మార్గాలు చూడకుండా శనికి ఆవేశం లో తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ప్రస్తుత కాలంలో పిల్లలకు చదువుల ఒత్తిడి అధికంగా ఉండటం వల్ల మానసికంగా కృంగిపోయి పిచ్చి పిచ్చి ఆలోచనలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ చిన్న సమస్య ఎదురైనా వాటిని అధిగమించి కొందాం ఆత్మహత్య మాత్రమే శరణ్యమని భావిస్తున్నారు. ఇటీవల ఇటువంటి సంఘటన ఒకటి విజయనగరం జిల్లాలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళితే..విజయనగరం జిల్లా నెల్లిమర్లలోని దేవాంగుల వీధికి చెందిన మనీషా అంజు కష్టపడి చదివి ఎచ్చెర్ల ట్రిపుల్ ఐటీ లో సీటు సాధించింది. మనీషా ఎళ్లప్పుడు చదువులో బాగా చురుగ్గా ఉంటూ ముందుండేది. అందరితో కలివిడిగా ఉంటూ తోటి విద్యార్థులతో సరదాగా ఉండేది. తన కూతురు కష్టపడి చదివి ఐఐటీలో సీట్లు సంపాదించేందుకు తల్లిదండ్రులు తమ కూతురు గురించి ఎంతో గర్వంగా చెప్పుకునేవారు. ఇటీవల మనీషా స్వగ్రామానికి వెళ్లి ఈనెల 15వ తేదీన తిరిగి హాస్టల్ కి వచ్చింది. 16వ తేదీన ఇంటికి ఫోన్ చేసి తనకు ఆరోగ్యం సరిగా లేదని చెప్పడంతో తన తండ్రి వచ్చి మనీషా కి ధైర్యం చెప్పి వెళ్ళిపోయాడు. కానీ మనీషా ఆరోజు రాత్రి హాస్టల్ గదిలో తన చున్నీతో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బంది వెంటనే మన దేశాన్ని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కూతురు ఇలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకోవటంతో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. అప్పటివరకు తోటి విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపిన ఉన్నట్టుండి ఇలా శవమై కనిపించడంతో విద్యార్థులందరూ ఒక్కసారిగా విలపించారు. ఇటీవలే ఇంటికి వెళ్లి తిరిగి వచ్చిన మనిషా ఇలా అర్థాంతరంగా ఆత్మహత్య చేసుకోవడంతో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇంటి మీద బెంగ ,చదువుల ఒత్తిడి లేక ఇతర కారణాల వల్ల మనీషా ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందో అని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.