white Hair: వయసు మళ్లిన తర్వాత జుట్టు తెల్లబడటం సహజం. కానీ తెల్ల జుట్టు సమస్య ప్రస్తుతం చిన్నపిల్లలోనూ, 30ఏళ్ల లోపు వాళ్లకు ఎక్కువగా ఉంది. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, బ్లీచింగ్, కాలుష్యం, విటమిన్ లోపం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ మొదలైన కారణాల వల్ల అతి చిన్నవయసులో జుట్టు తెల్లబడతాయని డాక్టర్లు చెబుతున్నారు. చిన్న వయసులోనే వచ్చిన తెల్లజుట్టును నల్లగా చేసుకోవడంకంటే తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడటం ఉత్తమం. మన ఇంట్లో దొరికే పదార్థాలతో ఈ సమస్యను అరికట్టవచ్చు. అది ఎలాగో ఇక్కడ తెలుసుకుందాం…
ఉసిరికాయ రసం రోజు 6ఔన్స్ లు తాగడం మరియు ఉసిరికాయ నూనె తలకు వారానికోసారి మసాజ్ చేయడం ద్వారా జుట్టు తెల్లబడటాన్నితగ్గించవచ్చు.
గోరువెచ్చని కొబ్బరినూనెను వారానికి రెండు సార్లు కుదుళ్లకు పట్టేలా మసాజ్ చేసి వేడి నీళ్లతో కడిగేసుకోవడం వల్ల ఫలితం ఉంటుంది.
కీరాదోస,2 స్పూన్ల ఆలీవ్ ఆయిల్, ఒక కోడిగుడ్డు మిక్సిలో వేసి పేస్టుల చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని తలకు పట్టించి 15నిమిషాల తర్వాత షాంపూ చేసుకోవాలి. నెలకు ఒకసారి ఇలా చేయడం ద్వారా తెల్ల జుట్టు రావడం తగ్గుతుంది.
ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం,గ్రే హెయిర్ ఎక్కువ అవడం జరుగుతుంది. ఆహారం లో ఐరన్ ఉన్న పదార్థాలు (ఖర్జూరం, లివర్ )చేర్చుకోవడం ద్వారా ఈ లోపాన్ని తగ్గించవచ్చు. ఈ విధమైనటువంటి ఆహార పదార్థాలను తీసుకొని ఈ చిట్కాలను పాటించడం వల్ల తెల్ల జుట్టు రాకుండా జాగ్రత్త పడవచ్చు. ఒకసారి తెల్లజుట్టు వచ్చిన తరువాత ఎన్నో రకాల డై వాడుతూ వాటి ఫలితంగా చర్మ సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది.ఇలా ఏ విధమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పై తెలిపిన పద్ధతులను పాటిస్తే తెల్లజుట్టుకు చెక్ పెట్టవచ్చు.