Health Tips: ఎముకల బలహీనతతో ఇబ్బంది పడుతున్నారా? అయితే ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకోవలసిందే

Health Tips:ఈ ఆధునిక కాలంలో వయసు తో సంబంధం లేకుండా చాలామంది అనేక వ్యాధుల బారిన పడుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలా మందినీ ఇబ్బంది పెడుతున్న సమస్యలలో ఎముకల బలహీనత కూడా ఒకటి. శరీరా ఆరోగ్యం పట్ల చూపే శ్రద్ద ఎముకల ఆరోగ్యంపట్ల చూపించరు. నిజానికి మనిషి శరీర బరువు మొత్తం ఎముకల మీద ఆధారపడి ఉంటుంది. శరీరంలోని ఏ ఎముక విరిగినా కూడా అది శరీరం మొత్తం మీద ప్రభావం చూపుతుంది. క్యాల్షియం నిల్వచేయడం, కండరాలను పటిష్టం చేయడం, అవయవాల రక్షణ అనేది ఎముకల యొక్క విధి. మనం తినే ఆహారం ఎముకల ఆరోగ్యం పట్ల తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఆహార నియమాల పట్ల జాగ్రత్త వహించకపోతే ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కష్టతరమవుతుంది.

హార్వర్డ్ హెల్త్ నివేదిక ప్రకారం ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, విటమిన్ డి, పాస్పరస్, పొటాషియం అవసరం. పండ్లు, కూరగాయలు, నిమ్మకాయలు, గింజలు, కొవ్వు రహిత ప్రోటీన్లను తినడం వల్ల ఈ పోషకాలను సులభంగా పొందవచ్చు. ఎముకల ఆరోగ్యానికి క్యాల్షియం ఎంతో అవసరం అవుతుంది. శరీరం తనంతట తానుగా క్యాల్షియంను తయారు చేసుకోలేదు, దానిని ఆహారం ద్వారానే పొందవలసి ఉంటుంది. రక్తంలో తగినంత క్యాల్షియం లేకపోతే శరీరం దానిని పొందడానికి ఎముకల మీద దాడి చేస్తుంది. ఫలితంగా ఎముకలు బలహీనపడతాయి. క్యాల్షియం పొందడానికి పాల ఉత్పత్తులు, బీన్స్, సోయా, కూరగాయలు, మూలికలు, పండ్లు, సముద్రపు ఆహారం తినాలి.

శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రోటీన్ల పాత్ర చాలా ముఖ్యమైనది. ఎముకల ఆరోగ్యం కోసం తగినంత ప్రొటీన్ శరీరానికి అవసరం అవుతుంది. దీనికోసం పాల ఉత్పత్తులు, చేపలు, పౌల్ట్రీ, నిమ్మకాయలు, తృణధాన్యాలు, గింజలు, విత్తనాలు, మొక్కజొన్న వంటి వాటిని తినవచ్చు. చేపలు బీన్స్ పెరుగు జున్ను, పాలు, కాటేజ్ చీజ్, కూరగాయలు, గింజలు వంటి వాటిలో ప్రోటీన్, కాల్షియం రెండు లభిస్తాయి. విటమిన్ డి సూర్య రష్మితో పాటు గా కొన్ని రకాల ఆహార పదార్థాలలో లభిస్తుంది. చేపలు, పాలు, నారింజ రసం, పుట్టగొడుగుల లో విటమిన్ డి పుష్కలంగా లభిస్తుంది.