మైగ్రేన్ అనేది ఈ మధ్య కాలంలో చాలా మంది ఇబ్బంది పెడుతున్న సర్వసాధారణమైన వ్యాధి. మైగ్రేన్ లేదా పార్శ్వపు తల నొప్పి నరాలకు సంభందించిన వ్యాధి. ఇది వరుసగా వెంట వెంటనే వస్తూ ఒక మోస్తరు నుండి తీవ్రస్తాయిలో వచ్చే తలనొప్పులలో ఒకటి. మైగ్రేన్ నుండి విముక్తి పొందడానికి తరచూ మందులు వాడుతూ ఉంటారు. అలా కాకుండా మైగ్రేన్ తలనొప్పిని మన ఇంటిలోనే కొన్ని చిట్కాలను ఉపయోగించి నయం చేయవచ్చు.
జర్నల్ ఆఫ్ ది అమెరికన్ మెడికల్ అసోసియేషన్ (JAMA) లో ఇటీవల చేసిన పరిశోదన ప్రకారం, ధ్యానం, యోగా మైగ్రేన్ లను తగ్గించగలవు. మైగ్రేన్ తో భాధపడుతున్నవారు నిత్యం తలనొప్పితో ఇబ్బంది పడుతుంటారు. కొందరిలో మైగ్రేన్ తలనొప్పికి ముందుగా కానీ లేదా నొప్పి వచ్చినపుడు కానీ కనిపించే లక్షణాలు వికారానికి గురికావడం, చూపు మందగించడం లేదా మోచేతులలో లేదా కాలులో జలదరింపు, వాయనం వంటివి. ప్రతిరోజూ దాదాపుగా 40 లక్షల మంది మైగ్రేన్ పై ఫిర్యాదు చేస్తున్నారు. ఈ వ్యాధి తో బాధపడుతున్న వాళ్ళలో 85 శాతం మహిళలే ఉన్నారు.
మీకు ఎప్పుడైనా మైగ్రేన్ అనుభవం ఉన్నట్లైతే అది రాకమునుపే దానిని ఎందుకు అదుపు చేయాలని మీకు తెలుస్తుంది. మైగ్రేన్ చికిత్స రెండు రకాలుగా ఉంటుంది.
1. నిరోధక (తలనొప్పులను అవి ప్రారంభం కాక మునుపే వాటిని నివారించడం)
2. తీవ్రమైన/నిష్పలమైన (తలనొప్పులు రావడానికి మునుపే వాటిని ఆపడం)
దీనిని తగ్గించడానికి జీవన సరళిలో మార్పులు, ఔషదాలు సేవించడం, పోషకాహార సహాయకలు (మెగ్నీషియం, కాక్ 10, విటమిన్ B2 లేదా B12). ఇన్స్టంట్ రిలీఫ్ కోసం పెయిన్ కిల్లర్లు, టీ తాగడం వలన ఫలితం కనిపిస్తుంది. కానీ రెగ్యులర్ గా టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. తాజా ద్రాక్ష పళ్లను జ్యూస్ చేసి రోజుకు రెండు సార్లు తాగడం వలన మైగ్రేన్ నుంచి ఉపశమనం పొందవచ్చు. అల్లం రసాన్ని కాస్త నిమ్మరసంలో కలిపిగానీ లేదంటే టీ లో అల్లం కలిపి కానీ తీసుకోవడం వల్ల మైగ్రేన్ తగ్గుతుంది.