Health Tips: మోకాళ్ల నొప్పులతో బాధ పడుతున్నారా…ఈ ఆహార పదార్థాలతో విముక్తి పొందండి!

Health Tips:ఈ మధ్యకాలంలో చిన్నా, పెద్దా అనే భేదం లేకుండా అనేకమంది మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడుతున్నారు. ఈ సమస్య బారిన పడటానికి ముఖ్య కారణం క్యాల్షియం లోపం. శరీరంలో సరిపడా కాల్షియం లేకపోతే అది మోకాళ్ల నొప్పులకు దారితీస్తుంది. మారిన ఆహారపు అలవాట్లు, ఒత్తిడి కారణంగా అనేకమంది ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకోలేక పోతున్నారు. మన శరీరంలో 90 శాతం కాల్షియం ఉంటుంది, దీని వల్లనే మన ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి. నాడీ వ్యవస్థ, ఎముకలు బలంగా, దృఢంగా ఉండటానికి కాల్షియం శరీరానికి ఎంతో అవసరం. అయితే కాల్షియం లోపిస్తే టాబ్లెట్లు వాడటం కంటే ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం వల్ల సాధారణంగానే కాల్షియం ఉత్పత్తి అవుతుంది.

పాలు, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చ కూరగాయలు, ఆకుకూరలు, బాదం, గుడ్లు, సోయాబీన్స్, నువ్వులు, వైట్ బీన్స్, నారింజ, జున్ను లలో కాల్షియం మెండుగా లభిస్తుంది.

– ఆకుపచ్చటి కూరగాయల లో కాల్షియం అధిక మొత్తంలో ఉంటుంది. పుదీనా, బ్రోకలీ, అరటి, బచ్చలి కూర వంటి కూరగాయలు ఆకుకూరలు క్యాల్షియం అధికంగా లభిస్తుంది. అంతే కాకుండా ఇందులో ఐరన్ కూడా అధిక మొత్తంలో లభిస్తుంది.
– పాలు మరియు పాల పదార్థాలలో కాల్షియం అధికంగా ఉంటుంది. మీ రోజువారీ ఆహారంలో పాలు, పెరుగు, జున్ను, వెన్న వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం లభిస్తుంది.
– కమలాపండ్లు,నారింజ పండ్ల లో అనేక పోషకాలు ఉంటాయి. వీటిని తరచూ తినడం వల్ల శరీరానికి అవసరమైన క్యాల్షియం ఇంకా విటమిన్ సి లభిస్తాయి.
– క్యారెట్, సోయాబీన్, క్యాబేజీ లలో క్యాల్షియం అధికంగా ఉంటుంది. మోకాళ్ళ నొప్పుల సమస్య తో బాధపడే వారు వారానికి ఒకసారి వీటిని తినడం వల్ల శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది.
– డ్రై ఫ్రూట్స్ లో అనేక పోషక విలువలు ఉన్నాయి. మోకాలి నొప్పులతో బాధపడేవారు రోజు కొన్ని డ్రై ఫ్రూట్స్ తినడం వలన ఉపశమనం పొందుతారు. డ్రై ఫ్రూట్ లో కాల్షియం అధికంగా ఉంటుంది.
– బీన్స్ వంటి పప్పుధాన్యాల లో క్యాల్షియం తో పాటుగా ఐరన్, జింక్, ప్రొటీన్, పొటాషియం, ఫోలేట్, ఫైబర్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. మోకాళ్ల నొప్పుల సమస్యతో బాధపడేవారు పైన తెలిపిన ఆహారపదార్థాలను తరచుగా తినటం మంచిది.