జాండీస్ సమస్యతో బాధపడుతున్నారు… ఈ ఆహార పదార్థాలతో చెక్ పెట్టండి!

వర్షాకాలం మొదలవడంతో అనేక రోగాలను వెంటబెట్టుకుని వస్తుంది. ఈ క్రమంలోని మనం రోగాల బారిన పడకుండా ఉండాలంటే సరైన ఆహార పదార్థాలను తీసుకోవడంతో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చు.ముఖ్యంగా వర్షాకాలంలో ఎక్కువగా చాలామంది కామెర్లు వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అయితే ఈ సమస్య నుంచి బయట పడటం కోసం తప్పనిసరిగా కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవాలి మరి ఆహార పదార్థాలు ఏమిటి అనే విషయానికి వస్తే…

వర్షాకాలంలో ఎక్కువగా జాండీస్ సమస్యతో బాధపడే వారికి పసుపు ఎంతో ఉపయోగపడుతుంది.పసుపులో కర్కుమన్ అని యాంటీ సమ్మేళనం ఉంటుంది. ఇది ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది.ఈ క్రమంలోనే ప్రతి ఒక్క ఆహారంలో చిటికెడు పసుపు చేర్చుకోవడం అలాగే భోజనం తర్వాత గ్లాసులో చిటికెడు పసుపు కలుపుకొని తాగటం వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు.

అదేవిధంగా అల్లం వెల్లుల్లి వంటివి కూడా ఈ వ్యాధిని దూరం చేయడానికి దోహదపడటమే కాకుండా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఉపయోగపడతాయి. అలాగే మన శరీరంలో ఉన్న ఫ్రీ రాడికల్స్ ను బయటకి తొలగించి కిడ్నీ పనితీరు మెరుగుపడటమే కాకుండా ఏ విధమైనటువంటి అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.