Beauty Tips: డ్రై స్కిన్ సమస్యతో బాధపడుతున్నారా… ఈ సింపుల్ చిట్కాలు పాటించండి అందమైన చర్మాన్ని మీ సొంతం చేసుకోండి!

Beauty Tips: అన్ని సీజన్ల కంటే వింటర్ సీజన్ చాలా ఆహ్లాదంగా ఉంటుంది.ఈ వింటర్ సీజన్ లోనే బ్యూటీ అండ్ హెల్త్ విషయంలో చాలా జాగ్రత్తలు అవసరం. ఈ కాలంలో గాలిలో తేమ బాగా తగ్గడం జరుగుతుంది. అందువల్ల చర్మం పొడిబారటం పగలడం దురద పెట్టడం ఇలాంటి సమస్యలు తరచూ వస్తుంటాయి. ఈ కాలంలో డ్రై స్కిన్ వారికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది. చిన్న చిన్న జాగ్రత్తలతో చలికాలంలో కూడా మీ చర్మాన్ని అందంగా,సున్నితంగా ఉంచుకోవచ్చు. అదెలాగో చూద్దాం..

చలికాలంలో పెద్దగా దాహం అనిపించదు, అందుకే నీరు తాగడం బాగా తక్కువ చేస్తాం. అలాకాకుండా దాహం వేసినా వేయకపోయినా రోజుకు కనీసం రెండు లీటర్ల నీళ్లు తాగాలి,ఇలా చేయడం వల్ల చర్మం సున్నితంగా ఉంటుంది. చలికాలం కదా అని వేడి వేడి నీటితో స్నానం చేస్తూ ఉంటాం, ఇది చర్మానికి హాని చేస్తోంది. గోరువెచ్చని నీటితో మాత్రమే స్నానం చేయాలి.
రోజు పడుకునే ముందు ఆలివ్ ఆయిల్ లేదా బాదం ఆయిల్ తో మర్దన చేసుకోవడం మంచిది,లేదా ఏదైనా మాయిశ్చరైజర్ రాసుకొన్న ఫలితం ఉంటుంది.

రోజు స్క్రబ్బింగ్ చేయడం వల్ల కూడా చర్మం పొడిబారుతుంది, చలికాలంలో స్క్రబ్బింగ్ వారానికి ఒకటి లేదా రెండు సార్లు చేసుకోవచ్చు. ముఖ్యంగా కెమికల్ కాకుండా నాచురల్ ఉపయోగించడం మంచిది. చలికాలంలో దొరికే ఫ్రూట్స్ తో ఫేస్ ప్యాక్ లు కూడా చర్మం పొడిబారకుండా కాపాడతాయి. చలికాలం లో దొరికే ఆరెంజ్, ఆపిల్, బనానా ఫేస్ ప్యాక్ ల వలన ఫలితం ఉంటుంది. ఇలా చేయటం వలన చలికాలంలో కూడా అందమైన చర్మం మీ సొంతం.