Bad breath: నోటి దుర్వాసన అనేది చాలా చిన్న సమస్యగా కనిపిస్తుంది కానీ నలుగురిలో మాట్లాడాలన్నా ఏమనుకుంటారో అని ఇబ్బంది కలుగుతుంది, కొంతమంది నోటిదుర్వాసన వచ్చే వారి దగ్గరికి వెళ్లి మాట్లాడాలన్నా సంకోచిస్తారు. ఈ నోటి దుర్వాసన చిన్ని చిన్ని చిట్కాలతో రాకుండా చేసుకోవచ్చు. నోటి దుర్వాసన అనేది శరీరంలోని నోరు, చిగుళ్లు దంతాలు ,జీర్ణ సమస్యల వలన ముఖ్యంగా వస్తుంది. మనం తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వలన కూడా నోటి దుర్వాసన వస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మసాలా పదార్థాలు ఉండటం కూడా కారణం అవుతుంది. బ్రష్ చేసుకోవడం వలన మౌత్ వాష్ లు వాడటం వలన కొద్దిగా నియంత్రించవచ్చు.
ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవడం ముఖ్యం. తద్వారా ఆహారం త్వరగా జీర్ణం అవుతుంది. అప్పుడప్పుడు కొద్దిగా వాము నమలడం మంచి అలవాటు. నీరు ఎక్కువగా తాగడం నోటి దుర్వాసనను అరికట్టవచ్చు, నీరు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థాలను బయటకు తొలగిస్తుంది. అంతేకాకుండా నోటిని తాజాగా ఉంచుతుంది.
ఉప్పు నీటితో తరచూ పుక్కిలించడం వలన కూడా ప్రయోజనం ఉంటుంది. ఉప్పు నీటితో కలిగించడం వలన నోటిలోని బ్యాక్టీరియాను అరికట్టవచ్చు.ఇలా తరచూ చేయడం వల్ల నోటిలో చెడు బాక్టీరియా వృద్ధి చెందకుండా ఉంటుంది.
అందరి వంటింట్లో దొరికే లవంగాలతో కూడా నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు. లవంగాల వల్ల నోటి దుర్వాసనే కాకుండా చిగుళ్ల వాపు కూడా నివారించవచ్చు. లవంగాలలోని యాంటీబ్యాక్టీరియల్ వల్ల నోటిలోని బ్యాక్టీరియాను ఈజీగా తగ్గించుకోవచ్చు. లవంగాలను పెట్టుకుని నమలటం మంచి అలవాటు, ఇలా చేయడం వల్ల క్రమంగా నోటి దుర్వాసనను తగ్గించడమే కాకుండా రక్తస్రావం దంతక్షయం వంటి వాటిని కూడా తగ్గించుకోవచ్చు. వీటితో పాటు రోజు ఉదయం లేవగానే బ్రెష్ చేసుకోవడం అలాగే రాత్రి పడుకునే ముందు బ్రష్ చేసుకోవడం అలవరచుకోవాలి. ఇలా చేయటం వల్ల నోటి దుర్వాసనకు చెక్ పెట్టొచ్చు.