ఎసిడిటీ, మలబద్ధకంతో బాధపడుతున్నారా.. అయితే ఈ పరిష్కారం మీ కోసమే?

ఎసిడిటీ అనేది రావడానికి మనం తీసుకునే ఆహార పదార్థాల వల్ల, సమయానికి భోజనం చేయకపోవడం వల్ల, తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల ఎసిడిటీ సమస్య వస్తుంది. నోటికి రుచిగా అనిపించడం వల్ల వయసుతో సంబంధం లేకుండా తీసుకునే ఆహారం కారణంగా గ్యాస్ ట్రబుల్ వస్తుంది.

గ్యాస్ ట్రబుల్ ఉన్న వ్యక్తుల్లో చాతి వద్ద నొప్పి, గట్టిగా పట్టేసినట్టుగా ఉంటుంది. ఈ గ్యాస్ ను తొలగించుకోవడానికి సహజ పద్ధతిలో వాము అనేది చక్కగా ఉపయోగపడుతుంది. వామును ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మరిగించి టీ లేదా కాఫీ తాగినట్టుగా కొంచెం కొంచెం తాగినట్లయితే అది లోపల గ్యాస్ పూర్తిగా తొలగిస్తుంది.

జీర్ణశక్తి ప్రక్రియను మెరుగుపరుస్తుంది. పుదీనా అనేది గ్యాస్ట్రిక్ సమస్యలకు మంచి ఔషధం. దీనిని పచ్చిగా అయినా తీసుకోవచ్చు లేదంటే మరిగించిన నీటిలో ఐదు నిమిషాలు ఉంచి కావాలంటే ఒక స్పూన్ తేనె వేసుకుని తాగితే మంచి ఉపసమనం లభిస్తుంది. దాల్చిన చెక్క కూడా గ్యాస్టిక్ సమస్యను దూరం చేస్తుంది.

అర స్పూన్ దాల్చిన చెక్క, అర స్పూన్ తేనె కలిపి కాస్త కాచిన పాలలో వేసి వడగట్టి త్రాగినట్లయితే పేగుల గోడలలోని పెపిన్ స్రవని నిలుపుదల చేసి, గ్యాస్ను అరికడుతుంది. సొంపులలో కూడా మంచి ఔషధాలు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత వీటిని నమ్మడం ద్వారా కడుపు ఉబ్బరం తగ్గి గ్యాస్ సమస్య దూరం అవుతుంది.

ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో కాస్త నిమ్మకాయ రసం వేసి తీసుకున్నట్లయితే కడుపులో ఉబ్బరం తగ్గడమే కాక, గ్యాస్ ను బయటికి తొందరగా పంపించి వేస్తుంది. మజ్జిగలో కూడా ఎన్నో ఆమ్లాలు, సహజంగా కడుపునొప్పి సమస్యలను దూరం చేసే లక్షణాలు ఉంటాయి. మజ్జిగలో కాస్త జీలకర్ర పొడి వేసుకొని భోజనం తర్వాత త్రాగితే మంచి ఉపశమనం లభిస్తుంది.