ఈటీవీ కి సుధీర్ స్వస్తి.. శ్రీదేవీ డ్రామా కంపెనీ నుండి కూడా తప్పుకున్నాడా..?

టెలివిజన్ లో సందడి చేస్తున్న అతి తక్కువ మంది మేల్ యాంకర్స్ లో సుధీర్ కూడా ఒకరు. సుధీర్ యాంకర్ గా కన్నా కమెడియన్ గా బాగా పాపులర్ అయ్యాడు. ఈటీవిలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించిన సుధీర్ కమెడియన్ గా బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో పోవే పోరా అనే షో కి యాంకర్ గా వ్యవహరించాడు. ఈటీవి ద్వారా బాగా ఫేమస్ అయిన సుధీర్ ప్రస్తుతం ఈటీవీలో కనిపించటం లేదు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్థస్త్, ఢీ, శ్రీదేవీ డ్రామా కంపెనీ వంటి షోలలో సందడి చేస్తున్న సుధీర్ మొదట ఢీ షో నుండి తప్పుకున్నాడు.

కొంత కాలం క్రితం నుండి జబర్ధస్త్ లో కూడా కనిపించటం లేదు. గత వారం వరకు శ్రీదేవి డ్రామా కంపెనీలో యాంకర్ గా సందడి చేసిన సుధీర్ ప్రస్తుతం ఈ షోలో కనిపించటం లేదు. ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ షో కి సంబందించిన ప్రోమోలో సుధీర్ స్థానంలో రష్మి యాంకర్ గా వచ్చింది. దీంతో సుధీర్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ఈ షోలో మానేశారని భావించారు. కానీ సుధీర్ మాత్రం మా టీవీలో ప్రసారం అవుతున్న సూపర్ సింగర్ జూనియర్స్ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నాడు. దీంతో సుధీర్ కావాలనే ఈటీవీలో ప్రసారమవుతున్న షోస్ లో కనిపించటం లేదా? అంటూ ప్రేక్షకులు అనుమానపడుతున్నారు.

దీంతో అందరి జబర్ధస్త్ కమెడియన్ల లాగే సుధీర్ కి కూడా మల్లెమాల వారితో గొడవలు అయ్యాయా..? అందుకే సుధీర్ మల్లెమాల ప్రొడక్షన్ లో వస్తున్న షోస్ మానేశాడా? ఇలా వరుసగా షో లు మానేయటంతో సుధీర్ ఈటీవీకి మల్లెమాల వారికి స్వస్తి చెప్పి వేరే ఛానల్ కి వెళ్ళాడని వినిపిస్తున్న మాటలలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలి మరి. కానీ సుధీర్ అభిమానులు మాత్రం సుధీర్ లేకపోతే మేము ఆ షోలు చూడము. సుధీర్ తిరిగి రావాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.