బాసరలో విద్యార్థులు భారీ నిరసన.. కేసీఆర్ లేదా కేటీఆర్ రావాలి అంటూ!

తాజాగా బాసర ఆర్ జి యు కే టి విద్యార్థులు తమ విద్యాలయంలో నెలకొన్న సమస్యల, సౌకర్యాల విషయంలో యాజమాన్యం చేస్తున్న నిర్లక్ష్యంపై ఆందోళన చేస్తూ నిరసనకు దిగారు. తెలంగాణ ఆవిర్భావం నుంచి తమ విద్యాలయంలో శాశ్వత వీసీ నియామకం జరగకపోవటం, ల్యాప్ టాప్ లు ఇవ్వకపోవడం, యూనిఫామ్ లు ఇవ్వకపోవడం, నాణ్యమైన భోజనం అందించకపోవడంతో విద్యార్థులు నిరసన చేస్తున్నారు.

అంతేకాకుండా విద్యాలయాన్ని సీఎం కేసీఆర్ లేదా మంత్రి కేటీఆర్ సందర్శించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నిరసన కొనసాగుతుంది అని అంటున్నారు. అక్కడ మొత్తం 6 వేల మంది విద్యార్థులు ప్లకార్డులతో నిరసన తెలుపగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.