Grey Movie : మనదేశంలో గడిచిన ఐదారేళ్లల్లో దాదాపు రెండు సంవత్సరాల కాలంలోనే 12 మంది న్యూక్లియర్ సైంటిస్టులు కనపడకుండా పోయారు. గతంలో కూడా ఇలా ఎన్నో సార్లు జరిగాయి. వీటన్నింటికి కారణం ఫారెన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సిస్. వారంతా వలపన్నీ చేసిన ఆపరేషన్స్ ఇవి.
అయితే వాటి సంఘటనల నుంచి పుట్టిన ఐడియానే గ్రే సినిమా అని దర్శకుడు రాజ్ మదిరాజ్ అన్నారు. ఈ చిత్రానికి అతడు దర్శకుడిగా చేస్తున్నాడు. అతడు విలేకరులతో మాట్లాడుతూ కొన్ని విషయాలను పంచుకున్నాడు. మంచిని సాధారణంగా మనం తెలుపుతో.. చెడును నలపుతో పోల్చుకుంటాం. కానీ ఈ రెండు రంగుల మధ్య ఎన్నో రంగులు ఉంటాయి.
ఎన్నో షేడ్స్ ఉంటాయన్నారు. అయితే ఒక ఆలోచన వెనుక కొన్ని వింతైన ఎక్స్ ప్రెషన్స్ ఉంటాయని.. అదే ‘‘గ్రే’’.. ఒక స్పై డ్రామా అని అన్నాడు. ఈ సినిమాలో ప్రధాన పాత్రదారులుగా అరవింద్ కృష్ణ నటిస్తున్నాడు. అతడితో రెండు సినిమాలు చేశానని.. మళ్లీ మూడో సారి అతడితో కలిసి పని చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.
అతడు ఈ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్ చేశాడని పేర్కొన్నాడు. అతడితో పాటు ఇందులో బిగ్ బాస్ 3 ఫేమ్ అలిరజా కూడా ఉన్నాడు. అతడు మంచి నటుడు అంటూ కితాబిచ్చాడు. వీరిద్దరితో పాటు ఈ సినిమాలో ప్రతాప్ పోతన్ కూడా ఉన్నాడు. అతడు ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ చేస్తున్నట్లు దర్శకుడు అన్నాడు. అతడిది ఒక రకంగా చెప్పాలంటే సూత్రధారి క్యారెక్టర్ అని చెప్పాడు. ఈ సినిమాలో ఊర్వశీ రాయ్ హీరోయిన్‌గా పరిచయం అవుతుందని పేర్కొన్నాడు. ఆమెది లీడింగ్ లేడీ క్యారెక్టర్. ఈ సినిమా ప్రతీ ఒక్కరు ఇష్టపడతారని.. తాము పస్ట్ కాపీ చూశామని.. చాల నచ్చిందన్నారు. స్పై థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ఎన్నో షేడ్స్ ఉన్నాయన్నారు. ఇక ఈ సినిమాకు కిరణ్ కాళ్లకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అద్వితీయ మూవీస్ ప్రై.లి పతాకంపై ప్రొడక్షన్ నెం.1గా ఈ చిత్రం రూపొందుతోంది. ద స్పై హూ లవ్డ్ మి అనే ట్యాగ్‌లైన్ తో తెరకెక్కిన ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా దాదాపు 40 ఏళ్ల తర్వాత బ్లాక్ అండ్ వైట్ లో వస్తుదంని.. దాని కోసం ఎంతో రీసెర్చ్ చేశామన్నారు.