Health Tips: వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతతో సతమతమవుతున్నారా? ఈ పప్పు దినుసులు ట్రై చేయండి..!

Health Tips: వేసవి కాలం మొదలై ఉష్ణోగ్రత తీవ్రత రోజు రోజుకి పెరిగి పోతూనే ఉంది. వేసవి తాపం నుండి శరీరాన్ని కాపాడుకోవడానికి చాలా మంది అనేక రకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వేసవి ఉష్ణోగ్రతల వల్ల శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండటానికి అధిక మొత్తంలో నీరు,జ్యూస్ వంటివి తరచూ తాగుతూ ఉంటారు. కానీ కొన్ని రకాల పప్పు దినుసులు కూడా మన శరీర ఉష్ణోగ్రత తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడతాయి.వేసవి కాలంలో శరీర ఉష్ణోగ్రతలు తగ్గించే కొన్ని రకాల పప్పు దినుసులు గురించి మనం తెలుసుకుందాం.

సాధారణంగా మన భారతదేశంలో పెసరపప్పుని వివిధ రకాల వంటలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. సాధారణంగా పెసరపప్పుతో దోసెలు, వడలు, పులగం వంటి ఆహార పదార్థాలు తయారు చేయటానికి ఉపయోగిస్తారు. వేసవి కాలంలో పెసర పప్పు శరీర ఉష్ణోగ్రత తగ్గించటానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. పెసరపప్పులో ప్రోటీన్, ఫైబర్, కాల్షియం ,మినరల్స్ అధికంగా ఉంటాయి. పెసరపప్పు ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి సీత సంబంధిత వ్యాధులు రాకుండా కాపాడుతాయి.

ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే పప్పుదినుసులు సోయాబీన్స్ కూడా ప్రధానమైనవిగా చెప్పవచ్చు. సోయాబీన్స్ లో ప్రోటీన్స్, ఫైబర్, క్యాల్షియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వేసవి కాలంలో ఇవి తినడం వల్ల శరీర ఉష్ణోగ్రతలు నియంత్రిస్తుంది. అంతేకాకుండా సోయాబీన్స్ తినటం వల్ల అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ ను కూడా నియంత్రిస్తుంది.

విటమిన్లు ప్రొటీన్లు అధికంగా వుండే పప్పు దినుసులలో మినప్పప్పు కూడా ఒకటి. ఓంకారం లో మినప్పప్పు తో తయారు చేసిన ఆహార పదార్థాలు తినటం వల్ల శరీర ఉష్ణోగ్రతలు అదుపులో ఉంటాయి. అంతేకాకుండా మినప పప్పు తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా నియంత్రించవచ్చు.