S.S Thaman: టాలీవుడ్ లో ఎస్.ఎస్.తమన్ పేరు తెలియని వారు ఉండరు. టాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకులలో ఎస్.ఎస్.తమన్ కూడా ఒకరు. రవితేజ హీరోగా నటించిన కిక్ సినిమా ద్వారా మ్యూజిక్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించిన తమన్ ప్రస్తుతం ఒక గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ గా నిలదొక్కుకున్నాడు. టాలీవుడ్ లో చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు
తమన్ ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.
ఈ సంవత్సరం తాజాగా తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేసిన ‘ భీమ్లా నాయక్ ‘ సినిమాలోని పాటలు అందరిని ఆకట్టుకున్నాయి. తనకు సంగీతం వారసత్వంగా వచ్చిందని తన తండ్రి 1000 సినిమాలకు పైగా డ్రమ్స్ వాయించారని తమన్ వెల్లడించారు. చిన్న వయసు నుండి సంగీత నేపథ్యం ఉన్న కుటుంబంలో పెరగటం వల్ల తనకి కూడా సంగీతం పట్ల ఆసక్తి పెరిగి సంగీత దర్శకుడిగా మారానని ఆయన చెప్పుకొచ్చారు.
ఎస్.ఎస్.తమన్ తన తండ్రి గురించి మాట్లాడుతూ ఆయన మరణించి 27 సంవత్సరాలు కావస్తోందని వెల్లడించారు. ఆయన చెల్లెలు ఐటీ లో జాబ్ మానేసి సంగీతం మీద ఉన్న ఆసక్తి వల్ల సింగర్ గా మారిందని చెప్పుకొచ్చారు. తమన్ తన భార్య శ్రీ వర్దిని గురించి మాట్లాడుతూ తన భార్య కూడా సింగర్ అని తన మ్యూజిక్ డైరెక్షన్ లో ఐదు పాటలు తన భార్య పాడిందని చెప్పుకొచ్చారు.. తనది పెద్దలు కుదిర్చిన వివాహం అని తన భార్య తనకోసం చాలా త్యాగం చేసిందని ఆయన వెల్లడించారు. సంగీత దర్శకుడిగా తనకు ఉన్న బాధ్యత వల్ల ఇంట్లో తన భార్యతో ఎక్కువ సమయం గడపలేకపోతున్నాను అని ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు.
తమన్ సంగీత దర్శకుడుగా వచ్చే ఏడాది భారీ చిత్రాలు విడుదల కాబోతున్నాయి . తమన్ ఒక్కో సినిమాకు మూడు కోట్లకు పైగా పారితోషికం తీసుకుంటున్నాడు. తమన్ తన కుమారుడి గురించి మాట్లాడుతూ కుమారుడికి కూడా సంగీతం అంటే ఆసక్తి ఎక్కువ అని కాకపోతే తన ముందు పాటలు పాడటానికి సిగ్గుపడుతూ ఉంటాడని తమన్ ఈ సందర్భంగా వెల్లడించారు.