Rajamiuli:అన్ని సినిమాలు పాన్ ఇండియా కావు… అలాంటి సినిమాలే పాన్ ఇండియా సినిమాలు: రాజమౌళి

Rajamouli:రణ్ బీర్ కపూర్, ఆలియా భట్ హీరో హీరోయిన్ గా నటించిన తాజా చిత్రం బ్రహ్మాస్త్ర. ఈ సినిమాకు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో రణ్ బీర్ కపూర్, ఆలియా భట్, అమితాబచ్చన్, మౌని రాయ్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు ఒక వార్త కూడా బయటకు వచ్చింది. ఈ సినిమా 2022 సెప్టెంబర్ 9న థియేటర్లలో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ సినిమాను దర్శక నిర్మాతలు ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా పలురకాల మోషన్ పోస్టర్ లతో, టీజర్ లతో గ్రాండ్ గా ప్రమోట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ తాజాగా హైదరాబాద్ లో జరిగింది.

ఈ కార్యక్రమానికి టాలీవుడ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ దర్శకుడు గురించి, పాన్ ఇండియా సినిమాలు గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.పాన్ ఇండియా సినిమాల విషయానికి వస్తే…ఏ సినిమా పాన్ ఇండియన్ సినిమా అవుతుంది ? అంటే వీఎఫ్ఎక్స్ ఎక్కువగా ఉంటేనా? భారీ బడ్జెట్ ఉంటే అవుతుందా?… ఒక సినిమా పాన్ ఇండియా సినిమా ఎలా అవుతుంది ? పాన్ ఇండియా సినిమాను ఏవిధంగా గుర్తుపట్టవచ్చు?

నేను బాహుబలి లాంటి సినిమాల తీసినా కూడా నా సినిమాల పరంగా అది పాన్ ఇండియా సినిమా అవుతుందా లేదా అని మాత్రం నేను చెప్పగలను. బ్రహ్మాస్త్ర దర్శకుడు అయాన్ సినిమా రషెష్ చూపించినప్పుడు… అందులో ఎక్కడా డైలాగ్ లేదు అంతే కాకుండా అక్కడక్కడా బ్యాడ్ పైలెట్ ట్రాక్ కూడా ఉంది. బెంచెస్ ఆఫ్ సీక్వెన్స్ కూడా ఉన్నాయి. నాకు హిందీ రాకపోవడంతో అయాన్ నాకు ట్రాన్స్ లేట్ చేస్తున్నాడు. నేను అలా నాకు అలా అనువదించాల్సిన అవసరం లేదని చెప్పాను.ఎందుకంటె భాషతో సంబంధం లేకుండా సినిమా అర్థమవుతుంది అంటే అదే పాన్ ఇండియన్ సినిమా అంటూ రాజమౌళి తెలిపారు. అదే విధంగా దర్శకుడు అయాన్ రాజమౌళితో ఈ సినిమా గురించి మాట్లాడినప్పుడు వీడెవడు నా కంటే పిచ్చోడిలా ఉన్నాడు అని అనుకున్నాను అని తెలిపారు.