మైత్రీ నుండి ఆ ఫ్లాప్ దర్శకుడికి పిలుపు వెళ్ళిందా ?

Srinu Vaitla may direct Akkineni Akhil
Srinu Vaitla may direct Akkineni Akhil
వరుస పరాజయాల్లో ఉన్న దర్శకుడు శీను వైట్ల గత ప్రయత్నం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ కూడా ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయింది.  దీంతో దాదాపు స్టార్ హీరోలందరితోనూ సినిమాలు చేసిన ఆయనకు అవకాశాలు బాగా తగ్గాయి.  హీరోలెవరూ ఆయనతో వర్క్ చేయడానికి సుముఖంగా లేరనేది వాస్తవం.  ప్రస్తుతం ఆయన మంచు విష్ణు హీరోగా ‘ఢీ అండ్ ఢీ’ సినిమా చేస్తున్నారు. 
 
నిజానికి ఇదేమీ పెద్ద సినిమా కాదు.  కానీ హిట్ అయితే శ్రీను వైట్ల మళ్లీ ట్రాక్లో పడతారు.  అయితే శ్రీను వైట్ల దృష్టి మొత్తం స్టార్ హీరోల మీదనే ఉంది. కథలు కూడ రెడీగా ఉన్నాయి ఆయన వద్ద. ఇలా ఎదురుచూపుల్లో ఉన్న ఆయనకు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నుండి పిలుపు వెళ్లినట్టు ఫిల్మ్ నగర్ టాక్. 
 
మైత్రీ మూవీస్ నిర్మాతల వద్ద చాలామంది హీరోల డేట్స్ ఉన్నాయి. అందరికీ అడ్వాన్స్ ఇచ్చేసి లాక్ చేసి పెట్టుకున్నారు. మైత్రీ వారి స్ట్రాటజీయే అది. అయితే హీరోల సంఖ్యకు సరిపడా దర్శకులే లేరు.  పెద్ద దర్శకులు, ఫామ్లో ఉన్న దర్శకులంతా బిజీగా ఉన్నారు. 
 
అందుకే మైత్రీ వారు వేరే దారిలో వెళ్తున్నారట. ఫ్లాప్లో ఉన్న పేరున్న దర్శకులను అప్రోచ్ అవుతున్నారట.  ఆ ప్రాసెస్లోనే వారి నుండి శ్రీను వైట్లకు పిలుపు వెళ్ళిందట. ఇంతకీ మైత్రీ నిర్మాతలు ఏ హీరో కోసం శ్రీను వైట్లను సంప్రదించారు అంటే అఖిల్ పేరు వినబడుతోంది.  అఖిల్ హీరోగా ఒక లవ్ స్టోరీ ప్లాన్ చేస్తున్నారు వారు.  దాని కోసమే శ్రీను వైట్లను లైన్లోకి తీసుకున్నట్టు సమాచారం.