ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మరణం పట్ల యావత్ దేశం దిగ్ర్భాంతికి లోనైంది. సుమారు 50 రోజులు మృత్యువుతో పోరాడిన బాలు.. శుక్రవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో తుదిశ్వాస విడిచారు. బాలు మరణవార్తతో యావత్ సినీ లోకం శోకసంద్రంలో మునిగిపోయింది. సంగీత ప్రియులకు తన గాత్రంతో ఎంతో వినోదాన్ని అందించిన ఎస్పీబీకి ఓ కోరిక తీరకుండానే మిగిలిపోయిందట. అది కూడా ఆయన తండ్రి సాంబమూర్తి కోరిక అంటా.
తనయుడు కర్ణాటక సంగీత కచ్చేరి చేస్తే వినాలని ఎస్పీబీ తండ్రి సాంబమూర్తి ఆశపడ్డారు. ఆ కోరిక తీరకుండానే సాంబమూర్తి పరమపదించారు. అయితే తన తండ్రి కోరిక మేరకు కర్ణాటక సంగతీ కచ్చేరి చేయాలని తాపత్రయపడ్డారు. అంతేకాకుండా ఆ సంగీత కచేరి కోసం అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆ కోరిక తీరకుండానే తిరగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అయితే ఎన్నో వేల కచేరీలు ఇచ్చిన బాలు కర్ణాటక సంగీత కచేరి ఎందుకు ఇవ్వలేకపోయారనే దానిపై సర్వత్రా చర్చ జరగుతోంది. అయితే దీనిపై బాలు సన్నిహితులు ఈ విధంగా పేర్కొంటున్నారు.
తండ్రి కోరిక మేరకు ఏదో అలా కర్ణాటక సంగీత కచేరి చేసి మమ అనిపించుకోవడం ఇష్టం లేదంట. ఎందుకుంటే ఎస్పీబీకి కర్ణాటక సంగీతంలో అంతగా ప్రావీణ్యం లేదు. దీంతో ఎంతో కొంత ప్రావీణ్యం సంపాదించి పూర్తి స్థాయిలో కచేరీ ఇవ్వాలనుకున్నారట. అందుకోసం ప్రముఖ సంగీత విధ్వాంసులు మంగళంపల్లి బాలమురళీకృష్ణను కలిశారు. కర్ణాటక సంగీతం నేర్చుకోవాలంటే కనీసం ఆరు నెలల సమయం పడుతుందని, వస్తే నేర్పుతానని ఎస్పీబీకి బాలమురళీకృష్ణ చెప్పారు. అయితే అన్ని పనులు పక్కకు పెట్టి ఆరునెలల సమయం కేటాయించ లేకపోయాడు. దీంతో తన తండ్రి కోరిక తీర్చుకుండానే ఎస్పీబీ అనంతలోకాలకు పయనమవడం విచారకరం.