ఎస్పీ బాలుకు భారతరత్న: సీఎం జగన్ కు ఎస్పీ చరణ్ కృతజ్ఞతలు

sp charan thanks to ap cm ys jagan

యావత్ సినీ లోకం ఇంకా ఆ బాధాకరమైన ఘటన నుంచి తేరుకోలేదు. ఎస్పీ బాలు మరణాన్ని సంగీత అభిమానులే కాదు.. సినీ ప్రపంచమే ఇంకా జీర్ణించుకోలేకపోతోంది. బాలు మన ముందు లేకప్పటికీ.. ఆయన తన పాటల రూపంలో ఎప్పుడూ మనతోనే ఉంటారు అని సినీ అభిమానులు అంటున్నారు.

sp charan thanks to ap cm ys jagan
sp charan thanks to ap cm ys jagan

భారత సినీ, సంగీత రంగానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా బాలుకు భారతరత్న ఇవ్వాలని… ఎస్పీ బాలును భారతరత్న అవార్డుకు కేంద్రానికి సీఎం జగన్ ప్రతిపాదించారు. దీనికి సంబంధించి ఎస్పీ చరణ్ కు ఏపీ సీఎం కార్యాలయం నుంచి లేఖ కూడా అందింది. దీంతో ఎంతో సంతోషానికి గురయిన ఎస్పీ చరణ్.. ఈ సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

నాన్నకు భారతరత్న ఇస్తే ఎంతో గౌరవంగా భావిస్తాను. నాన్నను భారతరత్నకు కేంద్రానికి ప్రతిపాదించిన సీఎం జగన్ కు ధన్యవాదాలు.. అని చరణ్ తెలిపారు.

మరోవైపు సీఎం జగన్ కు ప్రముఖ నటుడు కమల్ హాసన్ కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఎస్పీ బాలుకు భారత రత్న కోసం ప్రతిపాదించడంపై ఆయన ట్విట్టర్ లో స్పందించారు. బాలుకి భారతరత్న ఇవ్వాలని కోరినందుకు సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను.. అని కమల్ తెలిపారు.

ఎస్పీ బాలు కోసం మీరు చేసిన వినతి చాలా గౌరవమైనది. దీనిపై తమిళనాడులోనే కాదు.. దేశమంతా ఉన్న ఎస్పీ బాలు అభిమానులు ఎంతో హర్షం వ్యక్తం చేస్తారు.. అంటూ కమల్ ఏపీ సీఎం జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు.