Hyper Aadi: పొట్టోడు అంటూ ఆదిని దారుణంగా అవమానించిన యాంకర్… ఇలా పగ తీర్చుకుందా?

Hyper Aadi: హైపర్ ఆది ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జబర్దస్త్ కార్యక్రమంలో తన పంచ్ డైలాగులతో అందరిని ఆకట్టుకున్న ఆది ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమానికి దూరంగా ఉన్న శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో పాటు ఢీ 20 డాన్స్ షోలో కూడా సందడి చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన మరొక ప్రోమో విడుదల చేశారు. ఈ ప్రోమోలో భాగంగా జబర్దస్త్ యాంకర్ సౌమ్యరావు కూడా సందడి చేశారు.

గతంలో ఈ కార్యక్రమానికి యాక్టర్ నందు మాత్రమే యాంకర్ గా ఉండేవారు కానీ ఇప్పుడు సౌమ్యరావు కూడా యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా సౌమ్యరావు యాంకర్ గా ఎంట్రీ ఇవ్వడంతోనే హైపర్ ఆది పట్ల బాడీ షేమింగ్ కామెంట్స్ చేయటంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఇలా వేదిక పైకి ఎంట్రీ ఇచ్చిన సౌమ్యరావు మాట్లాడుతూ…”షో అందంగా ఉండాలని నన్ను తీసుకున్నారు. షో రేంజ్ పెరగాలని హైట్ గా ఉన్న నిన్ను(నందు) తీసుకున్నారు. వెయిట్ పెరగాలని వెయిట్ ఉన్న ఈ పొట్టోడిని(హైపర్ ఆది)ని పెట్టారు” అంది. హైపర్ ఆదిని పొట్టోడు అంటూ కామెంట్లు చేశారు.

ఇలా హైపర్ ఆది పై సౌమ్యరావు పంచ్ వేయడంతో అది ఏమాత్రం తగ్గకుండా..నేను ఉండగా నువ్వెందుకు ఇక్కడ, ఇప్పటి దాకా నువ్వు మాట్లాడిందే బొక్క అని సౌమ్య తిరిగి పంచ్ వేసింది. దానికి.. ఆపవే గుంటనక్క, అంటూ హైపర్ ఆది కౌంటర్ ఇచ్చాడు. అయితే ఇదంతా కూడా కార్యక్రమంలో ఒక భాగమే అని తెలుస్తుంది కానీ కొంతమంది నెటిజన్స్ మాత్రం ఈ విషయంపై స్పందిస్తూ జబర్దస్త్ కార్యక్రమంలో ఉన్నప్పుడు ఆది సౌమ్య రవు గురించి పంచులు వేస్తూ ఆమెపై కామెంట్ చేశారు అందుకు రివేంజ్ తోనే ఇప్పుడు సౌమ్య రావు కూడా హైపర్ ఆది పై పంచ్ వేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.