Nitya Shetty: ఆడిషన్స్ లో ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేసారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన దేవుళ్ళు మూవీ చైల్డ్ ఆర్టిస్ట్!

Nitya Shetty: నిత్యాశెట్టి.. చాలామంది ఈ పేరు చెబితే గుర్తు పెట్టకపోవచ్చు కానీ దేవుళ్ళు సినిమా చైల్డ్ ఆర్టిస్ట్ అంటే చాలు ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఈ సినిమాతో భారీగా గుర్తింపు తెచ్చుకుంది నిత్యా చిట్టి. కేవలం దేవుళ్ళు సినిమా మాత్రమే కాకుండా ఈ సినిమాతో పాటు అంజి, చిన్ని చిన్ని ఆశ, లిటిల్ హార్ట్స్, మాయ.. లాంటి ఎన్నో సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అంతేకాకుండా చైల్డ్ ఆర్టిస్ట్ గానే నంది అవార్డును కూడా అందుకుంది. అయితే ప్రస్తుతం మళ్ళీ సినిమా ఇండస్ట్రీ లోకి రీ ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా అలాగే కొన్ని కీలక పాత్రలో కూడా నటిస్తోంది.

ఇది ఇలా ఉంటే తాజాగా నిత్యా చెట్టి ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. కాగా ఈ సందర్బంగా నిత్యాశెట్టి మాట్లాడుతూ.. చైల్డ్ ఆర్టిస్ట్ కదా నేను ఇప్పుడు సినిమాల్లోకి వస్తే హీరోయిన్ గా పిలిచి ఛాన్సులు ఇస్తారు అనుకున్నాను. కానీ రియాలిటీ వేరు. నేను చేసే ఇన్ఫోసిస్ జాబ్ మానేసి సినిమాల్లోకి వచ్చాను. చాలా ఆడిషన్స్ కూడా ఇచ్చాను. ఒక ఆడిషన్ లో నా ముక్కు చిన్నగా ఉందని రిజెక్ట్ చేసారు. ముక్కు సర్జరీ చేసుకొని వస్తే ఛాన్స్ ఇస్తామని అన్నారు.

ఇంకోసారి దేవుళ్ళు పాప కదా హీరోయిన్ గా సెట్ అవ్వదు అని అన్నారు. ఇంకొక చోట నేను కాస్త నల్లగా ఉన్నాను, ఫెయిర్ లేను అని అన్నారు. అలాగే హీరోయిన్ గా గుర్తింపు తెచ్చిన సినిమా ఓ పిట్టకథ సినిమాకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. డైరెక్టర్ నన్ను ఒకే చేసినా నిర్మాతలు లావుగా ఉన్నాను అని అన్నారు. నన్ను ఓకే చేసి షూటింగ్ కి వెళ్లేసరికి ఛాలెంజ్ గా తీసుకొని 20 రోజుల్లో ఆరు కిలోలు తగ్గి చూపించాను అంటూ తనకు ఎదురైన అనుభవాలు తెలిపింది నిత్యా శెట్టి. ఈ సందర్బంగా ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.