Sourav Ganguly: గంగూలీకి కరోనా పాజిటివ్, ఆస్పత్రిలో చేరిక

Sourav Ganguly: కరోనా బారిన పడ్డారు. సోమవారం రాత్రి ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పటికీ.. ముందు జాగ్రత్తగా ఆయన్ను హాస్పిటల్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి కరోనా సోకింది. స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న దాదాను కోల్‌కతాలోని వుడ్‌లాండ్స్ హాస్పిటల్‌లో చేర్చారని తెలుస్తోంది. ఆర్టీపీసీఆర్ టెస్టులో వైరల్ లోడ్ 19.5గా ఉన్నట్లు తేలింది. టీమిండియా మాజీ కెప్టెన్ ఇప్పటికే రెండు డోసుల వ్యాక్సిన్ వేయించుకున్నారు. గంగూలీకి కరోనా సోకిందనే వార్తలు రాగానే.. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాక్షింస్తూ.. అభిమానులు అభిమానులు ప్రార్థనలు నిర్వహిస్తున్నారు.

ఈ ఏడాదిలో గంగూలీ హాస్పిటల్ పాలవడం ఇది మూడోసారి. ఈ ఏడాది ఆరంభంలో.. ఛాతిలో ఇబ్బంది కారణంగా దాదా హాస్పిటల్‌లో చేరారు. తర్వాత అది హార్ట్ అటాక్ అని తేలింది. కోల్‌కతాలోని తన నివాసంలో ఎక్సర్‌సైజ్ చేస్తుండగా.. గంగూలీకి హార్ట్ అటాక్ వచ్చింది. దీంతో రైట్ కరోనరీ యాంజియోప్లాస్టీ నిర్వహించారు. 20 రోజుల తర్వాత కూడా గంగూలీకి అదే విధంగా ఛాతిలో నొప్పి రావడంతో.. జనవరి 28న మరోసారి యాంజియోప్లాస్టీ నిర్వహించారు. ఈ ప్రక్రియలో భాగంగా గుండెలో రెండు స్టంట్లను అమర్చారు. అనంతరం కోలుకున్న గంగూలీ మార్చి నుంచి తన పని మొదలుపెట్టారు.