రజినీ అస్వస్థతకు, గంగూలీ గుండెపోటుకు బీజేపీయే కారణమా ?

BJP behind Rajinikanth, Sourav Ganguly 

భారతీయ జనతా పార్టీ ఆడుతున్న పొలిటికల్ గేమ్స్ నానాటికీ తీవ్ర రూపం  దాల్చుతున్నాయి.  పలు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలను అధిగమించాలనే లక్ష్యంతో బలం పుంజుకునే ప్రయత్నంలో బీజేపీ కొందరు వ్యక్తులను అందునా  సెలబ్రిటీలను టార్గెట్ చేస్తోంది.  వారిని ఎలాగైనా పార్టీలోకి తీసుకొచ్చి బలపడాలని చూస్తోంది.  ఈ ప్రక్రియలో సదరు వ్యక్తుల మీద దారుణమైన ఒత్తిడిని కలుగజేస్తోంది.  ఈమధ్య సూపర్ స్టార్ రజినీకాంత్ పార్టీ పెడతానని ఊరించి  ఊరించి చివరకు చేతులెత్తేశారు.  ఆరోగ్యం దృష్ట్యా రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్టు ప్రకటించారు.  దీంతో అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు.   పలు రాజకీయ పార్టీలు పిరికివాడైన రజినీకి ఎందుకు రాజకీయాలు అంటూ కేలన చేశాయి.  కానీ రజినీ నిర్ణయం వెనుక బీజేపీ ఉందని విశ్లేషకులు అంటున్నారు. 

చాలా ఏళ్లుగా రాజకీయ రంగప్రవేశం చేయాలనుకుంటూ మీమాంసలో ఉన్న రజినీ జయలలిత మరణం తర్వాత ఉన్నపళంగా పొలిటికల్ ఎంట్రీకి రెడీ అయ్యారు.  జయ మరణంతో తమిళ రాజకీయాల్లో గ్యాప్ ఏర్పడిందని, అందులోకి దూరాలని భావించి బీజీపీయే రజినీ మీద రాజకీయాల్లోకి రమ్మని ఒత్తిడి పెంచిందని, నేరుగా తమ పార్టీలో చేరడమా లేకపోతే పార్టీ పెట్టి మద్దతు ఇవ్వడమో చేయాలని తెలిపింది.  అందుకే రజినీ ఒకానొక దశలో బీజేపీకి అనుకూలంగా  మాట్లాడి ద్రవిడుల ఆగ్రహానికి గురయ్యారు.  అది ఆయన్ను బాగా బాధిచింది.  దీంతో రజినీ బీజేపీని ఎదిరించి సైలెంట్ అయిపోయారు.  అయితే ఎన్నికలు దగ్గరపడుతుండటంతో బీజేపీ నుండి రాయబారాలు ఎక్కువై పార్టీ ప్రకటించమని ఒత్తిడి పెరిగిందట.  ఆ ఒత్తిడి మధ్యలోనే రజినీ డిసెంబర్ 31ని ముహూర్తంగా నిర్ణయించారు.  కానీ విపరీతమైన ఆలోచనలు మధ్య షూటింగ్లో అస్వస్థతకు గురై చివరకు ఎలాగో తప్పించుకున్నారు.  బీజేపీ ఒత్తిడి లేకపోతే రజినీ ఆరోగ్యం భేషుగ్గా ఉండేదే. 

BJP behind Rajinikanth, Sourav Ganguly 
BJP behind Rajinikanth, Sourav Ganguly 

ఇక తాజాగా మాజీ క్రికెటర్ సౌరబ్ గంగూలీ గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు.  దాదా ఉన్నట్టుండి గుండెపోటుకు గురవడం వెనుక తీవ్రమైన ఒత్తిడి ఉందని వైద్యులు తెలిపారు.  ఈ ఒత్తిడి కూడ బీజేపీ పుణ్యమేనట.  బెంగాల్ రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ ను ఓడించాలనే లక్ష్యంతో ప్రజాదరణ కలిగిన గంగూలీని  పార్టీలో చేర్చుకోవాలని అనుకుంది బీజేపీ.  ఆమేరకు జాతీయ లీడర్లు గంగూలీ మీద తీవ్రమైన ఒత్తిడి తెచ్చారట.  ఈ విషయాన్ని గంగూలీ మిత్రుడు, సీపీఎం ఎమ్మెల్యే అశోక్ భట్టాచార్య బయటపెట్టారు.  బీజేపీలో చేరే ఉద్దేశ్యం లేకపోవడం, అధికారంలో ఉన్నవారిని కాదంటే ఏమవుతుందో అనే ఆందోళనతో   గంగూలీ విపరీతమైన ప్రెజర్ ఫీలై గుండెపోటు వచ్చి ఉండవచ్చు.  

దీన్నిబట్టి సెలబ్రిటీలు  ఇబ్బడిముబ్బడిగా జేపీలోకి ఎందుకు వెళుతున్నారో  అర్థమవుతోంది.  పార్టీలోకి రమ్మని ఆహ్వానించడం వరకు సరే కానీ ఇలా రావాల్సిందేనని బలవంత పెట్టడం, వారి ఆరోగ్యాలతో చెలగాటాలాడి ఆసుపత్రుల పాలయ్యేలా ఒత్తిడి చేయడం ఏమాత్రమూ నైతికత అనిపించుకోదు.