Viral video: దాదానూ పట్టుకున్న పుష్ప ఫీవర్… ఏ మాత్రం తగ్గట్లేదుగా…!

Viral video: తగ్గేదలే అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తన మేనరిజంతో పాన్ ఇండియా రేంజ్ లో అభిమానులను పుష్ప ది రైజింగ్ పేరుతో ఆకట్టుకున్న విషయం అందరికీ తెలిసిందే. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో రష్మిక తన అంద చందాలతో ప్రేక్షకులను అలరించి నేషనల్ క్రష్ గా కూడా పేరు తెచ్చుకుంది. ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం కొన్ని రోజుల వ్యవధిలోనే బాక్స్ ఆఫీస్ వద్ద కోట్లల్లో కాసుల వర్షం కురిపించి, తెలుగు సినిమా స్థాయిని ఎక్కడికో తీసుకెళ్ళింది.

అయితే మొన్నటి వరకూ సౌత్ లోనే పాపులర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న అల్లు అర్జున్, పుష్ప సినిమాతో నార్త్ లోనూ ఫ్యాన్స్ ను సంపాదించుకొని, మరో మెట్టు ఎదిగాడు. పుష్ప రాజ్ పేరుతో బన్నీ, అలరించిన తీరును ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. ఇప్పటికీ ఆ సినిమాలోని పాటలు, డాన్స్ లేదా డైలాగ్స్ తో ఏదో ఒక విధంగా పుష్ప సినిమాను అభిమానులు గుర్తు చేస్తూనే ఉన్నారు. దీంతో అందరికీ పుష్ప ఫీవర్ పట్టుకుంది అంటూ సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు అంతా ఇంతా కాదు.


ఇకపోతే ఆ సినిమాలోని డైలాగ్స్ ను, పాటలను అనుకరిస్తూ ఇప్పటి వరకూ ప్రేక్షకులే కాదు, సినీ సెలబ్రిటీలు సైతం పాపులర్ అయిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ ప్లేయర్స్ కూడా ఈ జాబితాలో చేరిపోతున్నారు. తాజాగా టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ కూడా ఈ లిస్ట్ లో చేరిపోయి అందర్నీ ఆకర్షిస్తున్నారు. ఇటీవల జీ బంగ్లా ఛానల్ లో ప్రసారమయ్యే ఓ రియాలిటీ షోలో పాల్గొన్న గంగూలీ, పుష్ప సినిమాలో ఎంతో ఫేమస్ అయిన శ్రీ వల్లీ సాంగ్ కు స్టెప్పులు వేస్తూ ఆశ్చర్య పరిచారు. అంతే కాకుండా ఆ సినిమాలోని సిగ్నేచర్ డైలాగ్ అయినటువంటి తగ్గేదేలే అన్న డైలాగ్ కు తన స్టైల్ లో అభిమానుల్లో జోష్ పెంచారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.