కేసీఆర్, చంద్రబాబు కలిసి జగన్ ను ఆడుకొనున్నారా!!

chandrababu kcr telugu rajyam

2019 ఎన్నికల తరువాత ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అందరికి తెలుసు. వైసీపీని ఎదురించి, మళ్ళీ పైకి రావడానికి చంద్రబాబు నాయుడు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ యొక్క రాజకీయ పరిస్థితి కూడా అచ్చంగా చంద్రబాబు నాయుడు యొక్క రాజకీయ జీవితాన్ని తలపిస్తుంది. టీడీపీ వైసీపీ నుండి ఓటమిని ఎదుర్కొనగా, కేసీఆర్ మాత్రం తెలంగాణలో తనకు అడ్డులేదని అనుకున్నారు కానీ ఇప్పుడు బీజేపీ రూపంలో ఊహించని రాజకీయ శత్రువు తయారు అయ్యారు. ఇలా రాజకీయ ఇబ్బందులు ఎదుర్కొంటున్న సీబీఎన్, కేసీఆర్ కలవనున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.

The TDP party will influence the Teresa party victory
Tdp vs Trs

సీబీఎన్, కేసీఆర్ కలవనున్నారా!

గ్రేటర్ ఎన్నికల తరువాత తెలంగాణాలో టీడీపీ పూర్తిగా ఖాళీ అయింది. దాంతో చంద్రబాబుకు ఏపీ మాత్రమే ముఖ్యమన్న సంగతి కూడా తెలిసిపోయింది. తెలంగాణాలో ఏదో మొక్కుబడిగా బాబు పోటీ చేశారు తప్ప ఆయన కానీ కొడుకు లోకేష్ కానీ ఈసారి డైరెక్ట్ గా కేసీయార్ తో తలపడలేదు. అది సానుకూల అంశంగా కేసీయార్ కి పరిణమించింది. అంతే కాదు, ఈసారి కేసీయార్ పార్టీ గెలిచిన సీట్లలో 27 పూర్తిగా సీమాంద్ర ప్రాంతాల నుంచి వచ్చినవే. దాంతో ఆ వర్గం ఓట్లు గుత్తమొత్తంగా కేసీయార్ పరం అయ్యాయి అంటే బాబు సామాజికవర్గం టీయారెస్ ని పూర్తిగా నమ్మినట్లే కదా. దాంతో ఇద్దరు చంద్రుల కలయిక‌కు ఇదే ప్రాతిపదిక అవుతోంది అంటున్నారు.

కలిస్తే ఇద్దరికి లాభమే

ఇప్పుడు ఒకవేళ రానున్న రోజుల్లో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ కలిస్తే రాజకీయంగా ఇద్దరికి లాభమే. చంద్రబాబు నాయుడు వైసీపీ నుండి, కేసీఆర్ బీజేపీ నుండి ఎదుర్కొంటున్న రాజకీయ ఇబ్బందులను ఇద్దరు కలిసి తమ వ్యూహాలు ద్వారా పరిష్కరించవచ్చని రాజకీయ వర్గాలు చెప్తున్నారు. ఇద్దరు రాజకీయ వ్యూహాలు రచించడంలో నిష్ణాతులు కాబట్టి జగన్ ఎదుర్కోవడంలో కేసీఆర్ బాబుకు, బీజేపీని ఎదుర్కోవడంలో కేసీఆర్ కు బాబు సలహాలు ఇచ్చిపుచ్చికొనే అవకాశం ఉంటుంది. ఇలా కేసీఆర్ బాబుతో కలిస్తే రానున్న రోజుల్లో సీఎం జగన్ రెడ్డికి కష్టాలు తప్పవని రాజకీయ వర్గాలు చెప్తున్నారు.