జమిలి ఎన్నికల కోసం లోకేష్ ను కాదని తానే రంగంలోకి దిగడానికి బాబు సిద్ధమయ్యాడా!!

cbn

2019 ఎన్నికల సమయంలో వచ్చిన ఓటమిని టీడీపీ నాయకులు ఇంకా మర్చిపోలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన షాక్ నుండి చంద్రబాబు నాయుడు ఇంకా కొలుకోలేదు. అయితే ఇప్పుడు జగన్ రెడ్డిని అధికారంలో నుండి దించడానికి చంద్రబాబు చాలా ప్రయత్నలు చేస్తున్నారు. అయితే జగన్ ను అధికారం నుండి దించడానికి జమిలి ఎన్నికలను బాబు ఉపయోగించుకోకున్నారు. ఈ జమిలి ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు ఇప్పటి నుండి బాబు వ్యూహాలు రచిస్తున్నారు.

cbn

లోకేష్ ను కాదని రంగంలోకి దిగిన బాబు

జమిలి ఎన్నికలు ఉండే అవకాశముండటంతో యువనేత లోకేష్ సైకిల్ యాత్ర చేయాలని నిర్ణయించారు. కానీ చంద్రబాబు యాత్ర చేస్తేనే సానుభూతి వస్తుందని ఎన్నికల వ్యూహకర్తలు కూడా చెప్పడంతో ఆయనే పాదయాత్ర చేయాలని నిర్ణయించారట. ఇందుకు రూట్ మ్యాప్ ను కూడా రూపొందించాల్సిందిగా పార్టీ ముఖ్యనేతలను ఆదేశించారని తెలిసింది. పాదయాత్ర ద్వారానే మళ్లీ ప్రజలకు చేరువకావాలని, క్యాడర్ లో జోష్ నింపాలని చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన గతంలోనూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మీకోసం పాదయాత్రను చేశారు. ఇప్పుడు మరోసారి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ మేరకు సీనియర్ నేతలకు చంద్రబాబు చెప్పినట్లు తెలిసింది.

అమరావతి నుండి పాదయాత్ర ప్రారంభించనున్నారా!!

జమిలి ఎన్నికల వస్తాయని అనుకుంటున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు పాదయాత్రకు సిద్ధమైన నేపథ్యంలో ఆ పాదయాత్రను అమరావతి నుండి ప్రారంభించాలని టీడీపీ నాయకులు భావిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ చంద్రబాబు నాయుడు పాదయాత్రను ప్రారంభిస్తే టీడీపీపై ప్రజల్లో సానుభూతి కలిగే అవకాశాలు ఉన్నాయి. రానున్న రోజుల్లో ఈ పాదయాత్ర ఎఫెక్ట్ రాజకీయాలపై ఎంత ఉంటుందో వేచి చూడాలి.