భారతీయ జనతా పార్టీ తెలుగు రాష్ట్రాల్లో జెండా పాతేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే అనేక పతకాలు రచించి ఎదురు దెబ్బలు కూడా తిన్నది. అయితే ఇప్పుడు చేసిన తప్పులను తెలుసుకున్న బీజేపీ నాయకులు మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో రాజకీయంగా బలపడడానికి ఇప్పటికే జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. జనసేనకు ఉన్న ప్రజల ఆదరణను తమవైపు తిప్పుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే ఇప్పుడు బీజేపీ మళ్ళీ టీడీపీ పొత్తు పెట్టుకుంటుందని వార్తలు వినిపిస్తున్నాయి.
మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటుందా!
2014 ఎన్నికల్లో తమ తమ అవసరాల కోసం టీడీపీ-బీజేపీ పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. ఆ తరువాత ప్రత్యేక హోదా విషయంలో రెండు పార్టీలకు పడకపోవడం వల్ల రెండు పార్టీలు 2019 ఎన్నికల సమయానికి రెండు పార్టీల నాయకులు బద్ధ శత్రువులు అయ్యారు. టీడీపీతో ఏర్పడిన శత్రుత్వాన్ని వైసీపీతో స్నేహంగా మార్కకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అయితే వైసీపీతో స్నేహం చేస్తే తమకు రానున్న రోజుల్లో కష్టాలు తప్పవని తెలుసుకున్న బీజేపీ నేతలు మళ్ళీ టీడీపీతో పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి వేరే పార్టీల యొక్క అవసరం అస్సలు లేదు. ఇప్పుడు ఒకవేళ బీజేపీ వైసీపీకి మద్దతు ఇచ్చినా కూడా ఆ క్రెడిట్ వైసీపీ ఖాతాలోకే వెళ్తుంది. అలాగే ఈ మధ్య కాలంలో వైసీపీ తీసుకుంటున్న నిర్ణయాలు వైసీపీకి చాలా చెడ్డ పేరు తెస్తున్నాయి. ఇప్పుడు వైసీపీతో స్నేహంగా ఉంటే ఆ చెడ్డ పేరు తమకు కూడా వస్తుందని భావించిన బీజేపీ నాయకులు మళ్ళీ చంద్రబాబు నాయుడుతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
రానున్న రోజుల్లో జగన్ కు కష్టాలు తప్పవా!
ఒకవేళ రానున్న రోజుల్లో బీజేపీ-టీడీపీ మళ్ళీ పొత్తు పెట్టుకుంటే వైసీపీ కష్టాల్లో పడటం ఖాయమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఎందుకంటే జనసేన, టీడీపీ, బీజేపీని ఎదుర్కోవడం వైసీపీ చాలా కష్టమైన పని. ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా కూడా ముగ్గురుతో కలిసి పోరాడటం మాత్రం సులువు కాదు. వచ్చే ఈ ప్రమాదాన్ని జగన్ ఎలా ఎదుర్కొంటారో వేచి చూడాలి.