Crime News: సాప్ట్ వేర్ ఇంజినీర్ మిస్సింగ్.. వేదింపులు భరించలేక భార్య పక్కా ప్లాన్..!

Crime News: తెనాలిలో అదృశ్యమైన సాఫ్టువేర్ ఇంజనీర్ కేసును చేజించిన పోలీసులు. స్థానిక డిఎస్పి కె. స్రవంతిరాయ్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… అతని భార్య కుటుంబీకులే హత్య చేశారని తేల్చారు. దీంతో హతుడి మామ, ఇద్దరు బావమరుదులు సహా మొత్తం ఐదుగురిని అరెస్ట్ చేశామని తెలిపారు.డిఎస్పి తెలిపిన వివరాల ప్రకారం… వారి కుటుంబాన్ని ఇబ్బంది పెడుతున్నాడని హతమార్చారు అని తెలిపారు. వేమూరు మండలం చావలి గ్రామానికి చెందిన సాఫ్టువేర్ ఇంజినీర్ నలుకుర్తి సుబ్బయ్యకు తెనాలి మండలం మల్లెపాడుకు చెందిన జయశ్రీ తో 2011 లో వివాహం అయ్యింది. అయితే కొన్నాళ్లకు భార్య పై అనుమానం పెంచుకున్న సుబ్బయ్య ఆమెను శారీరకంగా, మానసికంగా వేదిస్తుండేవాడు.

అతనితో విసుగు చెందిన భార్య 2018 లో తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్లో భర్త, అత్త, మరిది మీద వరకట్న వేధింపుల కేసు పెట్టింది. 2019 లో కోర్టు వాయిదాలు నడుస్తున్న సమయంలో జయశ్రీ, సుబ్బయ్య కుటుంబ సభ్యులు 2021 డిసెంబర్ 31 న తెనాలికి వాయిదా కోసం వచ్చి వెళుతున్న సుబ్బయ్య ను జయశ్రీ తండ్రి రవి, పెద్ద బావమరిది జయచంద్ర, చిన్న బావమరిది సుధాకర్ కలసి కిడ్నాప్ చేసి కండువాతో మెడకు బిగించి హత్య చేశారు. తర్వాత మృతదేహాన్ని కారులో
తీసుకెళ్లి కృష్ణ నది తీరాన ఉన్న ముళ్ళ పొదలలో మృత దేహాన్ని పడేసి పెట్రోల్ పోసి నిప్పు పెట్టి తగలపెట్టారు.

కోర్టు వాయిదాకు వెళ్లిన తన అన్న సుబ్బయ్య తిరిగి ఇంటికి రాలేదని అదృశ్యం కేసు నమోదు చేశారు . అప్పటి నుండి సుబ్బయ్య భార్య, మామ, బావమరుదులు, చిన్న అత్త, చిన్న మామల పై నిఘా ఉంచారు పోలీసులు. ఇది తెలిసిన నిందితులు పోలీసులకు తెలిసిపోయింది అనే భయంతో మల్లేపాడు వీఆర్వో దగ్గరకు వెళ్ళి లొంగిపోయారు. వీరిని గురువారం సాయంత్రం అరెస్ట్ చేశామని డిఎస్పీ తెలిపారు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేకపోయినా వన్ టౌన్ సిఐ చంద్రశేఖర్, ఎస్ఐ ఉమామహేశ్వర రావు ఎంతో చాకచక్యంగా కేసును ఛేదించారు అని డిఎస్పీ వీరిని అభినందించారు. నిందుతులను కోర్ట్ లో హాజరుపరిచారు.