Venu Swamy: వివాదాస్పద దర్శకుడు వేణు స్వామి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వేణు స్వామి నిత్యం ఏదో ఒక వివాదం ద్వారా వార్తలలో నిలుస్తూ ఉంటారు. అయితే ఎప్పటినుంచో జాతకాలు చెబుతూ ఉన్న వేణు స్వామి ఒక్కసారిగా సమంత నాగచైతన్య నిశ్చితార్థం జరిగిన తర్వాత వారు పెళ్లైన మూడు సంవత్సరాలకి విడిపోతారంటూ వారి గురించి జాతకం చెప్పారు.
ఇలా వేణు స్వామి సమంత నాగచైతన్య గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఒక్కసారిగా వార్తల్లో నిలిచారు. అయితే ఈయన చెప్పిన జాతకం నిజం కావడంతో ఒక్కసారిగా వేణు స్వామి ఫేమస్ అయ్యారు. అప్పటినుంచి సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారి జాతకాలు గురించి రాజకీయ నాయకుల జాతకాల గురించి చెబుతూ ఈయన వివాదాలలో కూడా నిలుస్తున్నారు.
ఇకపోతే ఇటీవల కాలంలో వేణు స్వామి చెప్పిన ఏ ఒక్క జ్యోతిష్యం కూడా నిజం కావడం లేదు. తాజాగా ఈయన పాకిస్తాన్ భారత్ మధ్య జరుగుతున్న యుద్ధం గురించి గతంలో ఒక వీడియో చేశారు. భూమి కోసమే ఈ యుద్ధం జరుగుతుందని ఈ యుద్ధం కారణంగా 80 శాతం నష్టం జరుగుతుందని కీలక నేతలందరూ చనిపోతారంటూ జాతకం చెప్పారు. అయితే ఈయన ఈ వీడియో విడుదల చేసిన కొంత సమయానికే భారత్ పాక్ మధ్య ఒప్పందం కుదుర్చుకొని కాల్పుల విరమణ చేశారు దీంతో వేణు స్వామి పై భారీ స్థాయిలో ట్రోల్స్ ఎదురవుతున్నాయి.
ఇటీవల కాలంలో వేణు స్వామి చెబుతున్న జాతకాలన్ని తప్పు అవడంతో ఇకపై ఈయనను వేణు స్వామి అని కాకుండా దొంగ స్వామి అని పిలవండి ఇదే పేరే తనకు కరెక్ట్ అంటూ సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఇలా వేణు స్వామి గురించి ఎన్నో విమర్శలు వస్తున్న ఈయన మాత్రం జాతకాలను చెప్పటం ఆ వీడియోలను షేర్ చేయటం మాత్రం ఆపటం లేదు.