ప్రస్తుతం ఏపీలో ఎక్కడ చూసినా అంతర్వేది రథం దగ్ధం గురించే చర్చ. నిజంగా అది హేయమైన చర్య. ఎన్నో ఏళ్ల చరిత్ర కలిగిన రథాన్ని అలా దగ్ధం చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదు. దానిపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం స్పందించింది. విచారణ చేయిస్తోంది. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. దానికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వచ్చేశాయి.
అయితే.. ఇదే అంశంపై ఏపీ దేవాదాయ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ… టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఫైర్ అయ్యారు. కొంచెం తొందరపడి ఏదేదో మాట్లాడేశారు. ఎన్నికల ముందు పవన్ కళ్యాణ్.. తన పిల్లలు క్రిస్టియన్స్ అని చెప్పారు.. ఇప్పుడేమో.. నేను హిందువును అని చెబితే నమ్మడానికి ఇక్కడ ఎవ్వరూ లేరు.. అంటూ కాస్త ఘాటుగా అన్నారు వెల్లంపల్లి. సినిమాల్లో ఆ వేషాలు వేసుకోవచ్చు..కానీ ఇక్కడ కాదు.. ఇక్కడ ఆ వేషాలు కుదరవంటూ వెల్లంపల్లి ఎద్దేవా చేశారు.
అంతే.. ఇక జనసైనికులు ఊరుకుంటారా? రెచ్చిపోయారు. మామూలుగానే వాళ్లు స్పీడ్ లో ఉంటారు. ఎప్పుడెప్పుడు వైసీపీ నేతలు దొరుకుతారా? వాళ్ల మీద పంచులు వేద్దామా? అని కాచుక్కూర్చుంటారు. ఇక వెల్లంపల్లి అడ్డంగా దొరికితే ఊరుకుంటారా? వేసేశారు.. ట్రోల్స్ స్టార్ట్ చేశారు. అయ్యా.. వెల్లంపల్లి.. ఎవరి గురించైనా మాట్లాడేముందు తమ గతాన్ని మరిచిపోతే ఎలా? కాస్త తమ గతాన్ని ఓసారి గుర్తు తెచ్చుకోండి.. అంటూ 2014 ఎన్నికల నాటి ఓ వీడియోను జనసైనికులు సోషల్ మీడియాలో షేర్ చేశారు.
2014 ఎన్నికల సమయంలో… పవన్ కళ్యాణ్ ను మీడియా ముందు.. అన్నా.. నా గురించి ఒకసారి మాట్లాడు అన్నా.. అంటూ పవన్ ను బతిమిలాడిన రోజులను మర్చిపోయావా వెల్లంపల్లి? అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఆ వీడియోను కూడా తెగ షేర్ చేస్తున్నారు. అప్పట్లో ఓ న్యూస్ చానెల్ లో దానికి సంబంధించిన స్టోరీ కూడా టెలికాస్ట్ అయింది.
పాపం వెల్లుల్లిపాయ్… మంత్రి వెల్లంపల్లి జనసైనికుల దెబ్బకు ఇలా అయిపోతాడని అనుకోలేదు.. వెల్లంపల్లికి జనసైనికులు చుక్కలు చూపిస్తున్నారు.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇంతకీ ఆ వీడియోను మీరు కూడా చూస్తారా?
పాపం వెల్లుల్లిపాయ్ 😂😂
మంత్రి వెల్లంపల్లి జనసైనికుల దెబ్బకి ఇలా ఐపోతావ్ అనుకోలేదు స్వామి😂😂😂😂🤣🤣🤣వెల్లంపల్లి కి చుక్కలు చూపిస్తున్న జనసైనికులు…😎😎😎@JanaSenaParty @PawanKalyan pic.twitter.com/HDRBkxhzLZ
— Thomas Shelby 🐎 (@4Harikrishna) September 10, 2020