లాక్ డౌన్ 5.0 కొనసాగుతున్నా సడలింపుల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా మహమ్మారి అంతకంతకు ప్రతాంపం చూపిస్తోంది. ప్రజలు రోడ్డు మీదకు రానంత కాలం ముడుచుకుని ఉన్న కరోనా వైరస్ రొడ్డెక్కడంతో ఒక్కసారిగా కోరలు చాచి విరుచుకుపడుతోంది. కేసుల సంఖ్య అమాంతం పెరిగిపోతుంది. కేసులకు ధీటుగా మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రస్తుతం భారత్ లో పరిస్థితి చూస్తుంటే ఆందోళనకరంగానే అనిపిస్తోంది. డబ్లూ హెచ్ ఓ కూడా ఎప్పటికప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినా భారత్ లాంటి అదిక జనాభా గల దేశంలో కష్టమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే భౌతిక దూరం అంటూ ఎన్ని చెప్పుకొచ్చినా వాస్తవ జీవితంలో అదెక్కడా సాధ్యపడలేదు. ఏ రాష్ర్ట సర్కార్ అంత సీరియస్ గా తీసుకున్న దాఖలాలు కనిపించలేదు.
ఇక ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు పాజిటివ్ కేసులను గుర్తించి చికిత్స అందిస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వంపై తొలి నుంచి పరీక్షలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుందంటూ ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టులో పిటీషన్ దాఖలు అవ్వడం కోర్టు మొట్టికాయలు వేయడం జరిగింది. కేసీఆర్ ఆయన్ను ఆయన సమర్ధించుకునే విధంగా మాట్లాడారు తప్ప! తప్పు ఉంది అని మాత్రం ఒప్పుకోలేదు. అందంతా గాలి ప్రచారం అంటూ కొట్టిపారేసారు. దేశ వ్యాప్తంగా లక్షల్లో కొవిడ్ పరీక్షలు జరుగుతుంటే తెలంగాణలో మాత్రం వేలల్లోనే కనిపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం సక్రమంగా పరీక్షలు చేస్తుందా? లేదా? అనుమానం మరింత బలపడుతోంది. ఒక ఉద్యోగికి కరోనా పాజిటివ్ రావడంతో సీఎం కార్యాలయం కూడా మూతపడింది. ఇప్పుడా ఆ కార్యాలయంలో పనిచేసే వారందరికీ కరోనా పరీక్షలు నిర్వహించాలి.
తాజాగా జూన్ 6 వతేది నాటికి దేశ వ్యాప్తంగా లక్షల్లో పరీక్షలు జరిగితే తెలంగాణలో మాత్రం 23,388 మందికి మాత్రమే పరీక్షలు జరిగాయి. వాటిలో 3,496 మందికి కన్ఫామ్ కేసులు కాగా, యాక్టివ్ లో 1663, కోలుకున్న వారు1710 మంది గాను, డీసీజ్ బారిన 123 మంది ఉన్నట్లు అధికారిక లెక్కల్లో ఉంది. ఈ లెక్కలన్నీ తప్పుడు తడకగానే కనిపిస్తున్నాయని పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. కేసులకు సంబంధించిన ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడించడంలో కూడా ప్రభుత్వం నాన్చుడి వైఖరి ప్రదర్శిస్తోందని విమర్శలొస్తున్నాయి. తాజాగా పాప్ సింగర్ స్మిత ఈ డేటానే ట్విటర్లో పోస్ట్ చేసి తన అహనాన్ని వెళ్లగక్కారు. సీఎం కేసీఆర్ సర్కార్ కరోనా పై ఎంత జాగ్రత్త గా ఉన్నారో? అంటూ ఈ ఉదంతం గురించి చెప్పకనే చెప్పి మండిపడ్డారు. అటు ప్రతిపక్షాలు మొదటి నుంచి టెస్టుల విషయంలో ప్రభుత్వాన్ని దుయ్యబెడుతోన్న సంగతి తెలిసిందే.