ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జంపింగ్ రాజకీయాలు అనేవి సర్వసాధారణం. ప్రతిపక్షములో ఉన్న నేతలు అధికపక్షము లోకి జంప్ చేయటం అనేది పెద్ద విషయం కాదు. 2014 ఎన్నికల తర్వాత అది రాష్ట్రంలో ఒక ఉద్యమం మాదిరి నడిచింది. వైసీపీ తరుపున గెలిచిన 23 మంది ఎమ్మెల్యే లు, ఒక ఎంపీ టీడీపీలోకి జంప్ చేశారు. అందుకు వాళ్ళు చెప్పే కారణం ఏమిటంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమని, కానీ అసలు అజెండా ఏమిటో అందరికి తెలుసు.
ఇక ప్రస్తుతం కూడా అదే స్థాయిలో జంపింగ్ లు జరగాల్సి వుంది, కానీ సీఎం జగన్ పెట్టిన కొన్ని కండీషన్స్ వలన టీడీపీ నేతలు ఆగిపోతున్నారు, ఎలాంటి పదవులు లేని నేతలు ఇప్పటికే పార్టీ మారిపోయారు. మరికొందరు నేతలు బయటనుండి మద్దతు ఇచ్చే కాన్సెప్ట్ లో భాగం అయ్యారు, ఈ నేపథ్యంలో కొందరు నేతలు బీజేపీ పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తుంది. టీడీపీ లో ఉంటే భవిష్యత్తు ఉండదని అర్ధం చేసుకున్న నేతలు అటు వైసీపీ లోకి వెళ్ళటం వీలుకాకపోవటంతో, బీజేపీ వైపు చూస్తున్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ, రేపోమాపో వైసీపీ తో పొత్తు పెట్టుకోవచ్చనే సంకేతాలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో బీజేపీలో చేరితే రేపొద్దున అధికారంలో భాగం కావచ్చనే ఆలోచన రావటంతో, టీడీపీ నుండి దాదాపు అరడజను మంది నేతలు ఇప్పుడు బీజేపీలోకి చేరటానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. ఆంధ్రలో బీజేపీ పార్టీ పరిస్థితి ఏమిటో అందరికి తెలుసు, ఆ పార్టీ కూడా ఇలాంటి జంపింగ్ నేతల కోసమే ఎదురుచూస్తుంది, దీనితో వెతకబోయిన తీగ కాలికే తగినట్లు అయ్యింది బీజేపీ పరిస్థితి, కాబట్టి వచ్చే జింపింగ్ నేతలకు రెడ్ కార్పెట్ పరవటానికి ఢిల్లీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు తెలుస్తుంది. అదే కనుక జరిగితే టీడీపీ పార్టీకి ఈ పరిణామం తీరని నష్టమని చెప్పాలి. ఇప్పటికే నలుగురైదుగురు ఎమ్మెల్యే లు పార్టీకి దూరం అయ్యారు. తాజాగా ఈ ఆరుగురు వెళ్ళిపోతే పార్టీ ఎమ్మెల్యే ల సంఖ్య డజన్ కు పడిపోతుంది. ఒక పక్క పార్టీని జాకీలతో పైకి లేపాలని బాబు చూస్తుంటే, మరోపక్క జంపింగ్ నేతలు కాషాయం కండువా కప్పుకోవడానికి సిద్ధం అవుతున్నారు.