Madharasi Teaser: పవర్ ప్యాక్డ్ అవతారంలో శివ కార్తికేయన్.. ఆకట్టుకుంటున్న మదరాసి టీజర్?

Madharasi Teaser: కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ గురించి మనందరికీ తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతున్నాడు శివ కార్తికేయన్. ఇటీవల కాలంలో శివ కార్తికేయన్ నటించిన సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్లుగా నిలుస్తున్నాయి. అందులో భాగంగానే గత ఏడాది అమరన్ మూవీ తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమాను అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో శివ కార్తికేయన్ క్రేజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ మరింత పెరిగింది అని చెప్పాలి. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఆయనను ప్రశంసించకుండా ఉండలేకపోయారు.

ఇందులో సాయి పల్లవి హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు భారీగా కలెక్షన్లను కూడా సాధించింది. ఇకపోతే ప్రస్తుతం హీరో శివ కార్తికేయన్ తన తదుపరి సినిమా చిత్రీకరణలో భాగంగా బిజీగా ఉన్నారు. శివకార్తికేయన్, ఎ.ఆర్. మురుగదాస్ కాంబినేషన్‌ లో వస్తున్న హై ఆక్టేన్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ మదరాసి. మురుగదాస్ ఈ సంవత్సరం రెండు మేజర్ ఫిలిమ్స్ అందించబోతున్నారు. శ్రీ లక్ష్మీ మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రం విజువల్ వండర్ గా అద్భుత స్థాయిలో రూపొందుతోంది. అయితే నేడు శివకార్తికేయన్ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి యాక్షన్ ప్యాక్డ్ గ్లింప్స్ తో ఈ చిత్రం టైటిల్ మదరాసి ని రివిల్ చేశారు మేకర్స్.

Madharasi | Title Glimpse | Sivakarthikeyan | A.R.Murugadoss | Anirudh | Sri Lakshmi Movies

శివకార్తికేయన్ పూర్తిగా పవర్ ప్యాక్డ్ అవతార్‌ లో కనిపించారు. ఈ గ్లింప్స్ సినిమాలోని ఇతర కీలక పాత్రలను కూడా పరిచయం చేసింది. టైటిల్ గ్లింప్స్‌ లో సినిమాటో గ్రాఫర్ సుదీప్ ఎలామోన్ హై క్లాస్ విజువల్స్ ఆకట్టుకున్నాయి. రాక్‌స్టార్ కంపోజర్ అనిరుధ్ రవిచందర్ తన ఎలక్ట్రిఫైయింగ్ స్కోర్‌ తో విజువల్స్‌ ను ఎలివేట్ చేశాడు. తన ఇంటన్సీవ్ నెరేటివ్ గ్రిప్పింగ్ స్టొరీ టెల్లింగ్ తో ఆకట్టుకునే ఎఆర్ మురుగదాస్ మదరాసి సినిమాతో సరికొత్త ఎక్సయిటింగ్ యాక్షన్ ప్యాక్డ్ కథను చూపించబోతున్నారని అర్థమవుతోంది. ప్రస్తుతం ఈ టీజర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.. ఈ వీడియోకి ప్రేక్షకులు అభిమానుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్ చూసిన అభిమానులు ఈ సినిమాతో శివ కార్తికేయన్ ఖాతాలో మరో హిట్ సినిమా పడడం ఖాయం అని కామెంట్స్ చేస్తున్నారు.