Anushka Shetty: సూపర్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమయ్యారు నటి అనుష్క శెట్టి. ఇలా మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం ఎన్నో ప్రయోగాత్మక సినిమాలలోను లేడీ ఓరియంటెడ్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇకపోతే బాహుబలి సినిమా తర్వాత ఈమెకు పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెరిగిపోయింది. ఇక అనుష్క తన వ్యక్తిగత కారణాలవల్ల ఇటీవల కాలంలో సినిమాలను కూడా కాస్త తగ్గించారని చెప్పాలి. ఇక ఈమె త్వరలోనే ఘాటి అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఇలా అనుష్క కెరియర్ పక్కనపెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు అవుతున్న ఇప్పటికీ కూడా అనుష్క పెళ్లి గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో అనుష్క పెళ్లి గురించి నిత్యం ఎన్నో రకాల వార్తలు వినపడుతూనే ఉంటాయి. తాజాగా అనుష్క శెట్టి పెళ్లి గురించి మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు అలాగే తాను చేసుకోబోయే అబ్బాయి గురించి కూడా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఈ సందర్భంగా అనుష్క మాట్లాడుతూ బాహుబలి సినిమా తర్వాత నాపై పెళ్లి ఒత్తిడి పెరిగిందని తెలిపారు. కుటుంబ సభ్యులతో పాటు మీడియా ముందుకు వచ్చిన తనకు పెళ్లి గురించి ప్రశ్న ఎదురవుతుందని అనుష్క తెలియజేశారు. పెళ్లి పై నాకు పూర్తి నమ్మకం ఉందని సరైన వ్యక్తి వచ్చినప్పుడు సరైన సమయం వచ్చినప్పుడు తప్పకుండా పెళ్లి చేసుకుంటానని తెలిపారు. నాకు పిల్లలు అంటే చాలా ఇష్టం అయితే నేను ప్రేమ లేకుండా ఏ వ్యక్తిని పెళ్లి చేసుకోనని ప్రేమించే పెళ్లి చేసుకుంటానని అయి విషయంలో నా కుటుంబ సభ్యుల మద్దతు కూడా నాకు ఉంటుందని తెలిపారు. నేను సరైన వ్యక్తి కోసం ప్రస్తుతం ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిని తాను పెళ్లి చేసుకోను అంటూ ఈ సందర్భంగా అనుష్క క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఈమె పెళ్లి గురించి కాబోయే వ్యక్తి గురించి చేస్తున్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
