Side Effects Of Lemon Water: ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి . అందరికీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది ఆరోగ్యాన్ని కాపాడుకోవటానికి అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు . అటువంటి ప్రయత్నాలలో ప్రతిరోజు ఉదయం నిమ్మరసం తాగటం కూడా ఒకటి . ప్రతిరోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి . ఆ నీటిని తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు మనం వాటి గురించి తెలుసుకుందాం .
నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్ ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. అధిక బరువు సమస్యతో బాధపడేవారు ప్రతి రోజు ఉదయం గోరువెచ్చని నీటిలో నిమ్మరసం , తేనె కలుపుకొని తాగడం వల్ల ఫలితం ఉంటుంది . ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న నిమ్మరసం తాగడం వల్ల శరీరానికి హాని కూడా కలుగుతుంది .
నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల ప్రతిరోజు ఉదయం నిమ్మరసం తాగడం వల్ల దంతాలకు ఉన్న ఎనామిల్ తొలగిపోయి క్రమేపి దంతాల సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి . అలాగే నిమ్మరసంలో ఉన్న యాసిడ్ కారణంగా దంతక్షయం ఏర్పడుతుంది .
ప్రతిరోజు నిమ్మరసం తాగటం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఎక్కువగా ఉండటం వల్ల కడుపు నొప్పి , మూత్ర విసర్జన సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది . నిమ్మరసంలో ఉండే యాసిడ్ వల్ల ఎముకలకు హాని కలుగుతుంది . నిమ్మరసం ఎక్కువగా తాగటం వల్ల ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య మొదలవుతుంది ఇది .
మైగ్రేన్ సమస్యతో బాధపడేవారు నిమ్మరసం ఎక్కువగా తాగకపోవడం మంచిది . తరచూ నిమ్మరసం తీసుకోవడం వల్ల వారి సమస్యలు పెరిగే అవకాశాలు ఉన్నాయి . సాధారణంగా ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నవారికి నోటిపూత సమస్యలు తలెత్తుతాయి. అటువంటి వారు నిమ్మరసం ఎక్కువగా తాగటం అన్న వారి సమస్య అధికమవుతుంది .