Shyam Singha Roy Trailer : నేచురల్ స్టార్ నాని భారీ అంచనాల ‘శ్యామ్ సింగ రాయ్’ ట్రైలర్ రిలీజ్ రాయల్ ఈవెంట్ ఈ రోజు సాయంత్రం వరంగల్ లోని కాకతీయ యూనివర్శిటీలోని కాలేజ్ గ్రౌండ్‌లో ఆభిమానుల కేరింతల నడుమ ఘనంగా జరిగింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి భారీ స్థాయిలో నిర్మిస్తున్న ఈ పీరియెడ్ మూవీ థియేట్రికల్ ట్రైలర్ గతంలో విడుదల చేసిన తీజర్ కి ట్రైలర్ సినిమాకు మరో కోణాన్ని చూపిస్తోంది.
ఇందులో నాని వాసుగా ఐటీ జాబ్ వదిలేసి సినిమా పరిశ్రమలో దర్శకుడిగా కృషి చేయాలని ప్రవేశిస్తాడు. అనుభవామ్ లేక అది చేతకాక నావ్వుల పాలవుతూంతాడు. తన ప్రయత్నాలకి హీరోయిన్ గా వున్న కృతీ శెట్టి నానితో ప్రేమలో పడుతుంది. ఇంతలో ఒక సంఘటనతో నాని కున్న ఆధ్యాత్మిక శక్తులు అతడ్ని కలకత్తాలో శామ్ ససిఎంగా రాయ్ గా 1960 ల దహ్స్కంలోకి టేసి కెళ్ళి పోతుంది. దేవదాసి అయిన సాయి పల్లవిని గాఢంగా ప్రేమిస్తున్న రచయిత తను. ఆమెను పెళ్లి చేసుకోవడానికి దేవదాసీ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడుతాడు. ఈ క్రమంలో అతను చాలా అవమానాలను ఎదుర్కొంటాడు.
అసలు వాసు, శ్యామ్‌సింగ రాయ్‌ల మధ్య వున్న సంబంధం ఏమిటనేది తెలియకుండా ట్రైలర్ కవర్ చేస్తుంది. ఈ సస్పెన్స్ కోసం క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 24 నా విడుదలయ్యే సినిమా చూడాల్సిందే.
ఈ నానీ లేటెస్ట్ మూవీని రాహుల్ సాంకృత్యాయన్ లవ్, కామెడీ, డ్రామా, యాక్షన్, అతీంద్రియ అంశాలతో కూడిన కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్టు ట్రైలర్ ని బట్టి తెలుస్తోంది. ట్రైలర్ మాత్రం సూపర్ గా వుంది. వాసు క్యారక్టర్ లో నాని చాలా ఫన్నీగానూ, శ్యామ్ సింగ రాయ్ గా క్లాస్ లుక్ తోనూ వున్నాడు. సాయి పల్లవి పీరియెడ్ పాత్ర, కృతీ శెట్టి మోడరన్ పాత్రల్లో వున్నారు. మడోన్నా సెబాస్టియన్ లాయర్‌గా వుంది.
పీరియడ్ పోర్షన్స్ కి కలకత్తా కళాదర్శకత్వం అద్భుతంగా వుంది. సెట్స్, లొకేషన్స్ నిర్మాణ విలువలు ఉన్నత ప్రమాణాలతో వున్నాయి. కెమెరా వర్క్, బీజీఎం సైతం రిచ్ గా వున్నాయి. బిజీఎం లో బెంగాలీ బాణీలు స్వరపర్చాడు మిక్కీ జె మేయర్.
నానితో బాటు సాయి పల్లవి, కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాహుల్ రవీంద్రన్, మురళీ శర్మ, అభినవ్ గోమతం, జిషు సేన్ గుప్తా, లీలా శాంసన్, మనీష్ వాద్వా, బరున్ చందా తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. శ్యామ్ సింగరాయ్ డిసెంబర్ 24న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం అన్ని సౌత్ భాషల్లో విడుదల కానుంది. కథ సత్యదేవ్ జంగా, సంగీతం మిక్కీ జె మేయర్, కెమెరా సాను జాన్ వర్గీస్, ఎడిటింగ్ నవీన్ నూలి, కొరియోగ్రఫీ: కృతి మహేష్, యష్, ఫైట్స్ రవివర్మ, ప్రొడక్షన్ డిజైన్ అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత ఎస్ వెంకట రత్నం, నిర్మాత వెంకట్ బోయనపల్లి.