షాకింగ్ : పెళ్లి కాకుండా ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన స్టార్ హీరోయిన్.!

Nithya Menon

కొంతమంది స్టార్ హీరోలు సహా స్టార్ హీరోయిన్ లు కొన్ని సార్లు చాలా వరకు బోల్డ్ స్టేట్మెంట్స్ ఇవ్వడం అలాగే బోల్డ్ నిర్ణయాలు అయితే చూసాం. ఇలాంటివి అయితే ఎక్కువగా బాలీవుడ్ లో జరుగుతూ ఉంటాయి. అక్కడి నటీనటులు ఇలాంటివి అనౌన్స్ చేస్తూ ఉండగా..

రీసెంట్ గానే సీతా రామం హీరోయిన్ మృణాల్ ఠాకూర్ తాను పెళ్లి చేసుకోకుండా తల్లిని కావాలని అనుకుంటున్నానని చెప్పి అందరికి షాకివ్వగా ఇప్పుడు మరో స్టార్ హీరోయిన్ నిత్య మీనన్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ షాకింగ్ గా మారింది.

మరి నిత్య మీనన్ అయితే తాను ప్రెగ్నెంట్ అయ్యిట్టుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ ఉన్నట్టు తెలిపింది. అంతే కాకుండా ఇక్కడ నుంచి వండర్ మొదలు అంటూ తెలిపింది. అయితే దీనితో ఈ పోస్ట్ చూసి ఒక్కసారిగా అంతా షాక్ అయ్యారు. ఇంకా నిత్య కి పెళ్లి కాలేదు కదా? పెళ్లి అయ్యిందా అని ఆరాలు కూడా తీస్తున్నారు.

అయితే దీనిపై అసలు బీజం ఏంటో అనేది తెలుస్తుంది. ఇది ఆమె సినిమా ప్రమోషన్ కోసం పెట్టిన పోస్ట్ మాత్రమే అని అందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తుంది. కాకపోతే ఈ రకంగా ప్రమోట్ చెయ్యడం అనేది కూడా కాస్త షాకింగ్ అనే చెప్పాలి. ఇక రీసెంట్ గా అయితే నిత్య మీనన్ ధనుష్ తిరు సినిమాలో కనిపించి అలరించింది.