తమిళ హీరోపై నిత్య మీనన్ షాకింగ్ కామెంట్స్ వైరల్..

Nithya Menon

తమిళ్ సహా తెలుగు సినిమా దగ్గర కూడా మంచి ఆదరణ ఉన్న యంగ్ నటీ నటుల్లో నాచురల్ అండ్ అండర్ రేటెడ్ హీరోయిన్స్ కూడా కొందరు ఉన్నారు. ఎక్స్ పోజింగ్ లాంటి వాటికి కూడా దూరంగా ఉండే హీరోయిన్స్ లో యంగ్ నటి నిత్యా మీనన్ కూడా ఒకామె. మరి నిత్య ఇప్పుడు తెలుగులో అయితే సహా తమిళ్ లో హీరోయిన్ గా తక్కువ సినిమాల్లోనే కనిపిస్తుంది.

ఆయితే ఇప్పుడు నిత్య మీనన్ ఓ వెబ్ సిరీస్ తో ఓటిటిలో పలకరించేందుకు సిద్ధం అయ్యింది. మరి ఆ సిరీస్ నే “కుమారి శ్రీమతి” కాగా ఈ సిరీస్ అయితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రాబోతుంది. మరి ఈ ఈ సిరీస్ ప్రమోషన్స్ లో నిత్య మీనన్ ఫుల్ బిజీగా ఉంది. మెయిన్ గా తెలుగు సహా తమిళ్ భాషల్లో ఆమె ఇంటర్వ్యూస్ కూడా ఇస్తుంది.

మరి ఇప్పుడు ఓ ఇంటర్వ్యూ లో నిత్య మీనన్ తాను ఇండస్ట్రీలో ఎదుర్కొన్న ఇబ్బందుల కోసం చెప్పింది అంటూ కొన్ని షాకింగ్ అంశాలు వైరల్ గా మారాయి. ఐతే తాను టాలీవుడ్ నుంచి అప్పటివరకు ఇన్నేళ్ళలో ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని కానీ కోలీవుడ్ లో మాత్రం తనకి చేదు అనుభవం ఎదురైంది.

ఓ హీరో నా పట్ల చాలా దురుసుగా ప్రవర్తించేవాడు. అది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపించింది అని ఆమె చెప్పినట్టుగా ఓ షాకింగ్ స్టేట్మెంట్ వైరల్ గా మారింది. కాగా దీనిపై తమిళ సినీ ట్రాకర్స్ మాత్రం అసలు అలాంటిది ఏమీ లేదని నిత్య మీనన్ అలాంటి కామెంట్స్ చేయలేదు అని అంటున్నారు. మరి ఎందులో నిజముందో అనేది తెలియాల్సింది.