విజయ్ ని వెనక్కి తోసేశారట..!

ప్రెజెంట్ టాలీవుడ్ లో ఉన్న టైర్ 2 హీరోస్ లో మంచి మార్కెట్ అండ్ క్రేజ్ లో అయితే యుంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఒకడు. కాగా ఇప్పుడు సిజె దేవరకొండ హీరోగా నటించిన చిత్రం “ఖుషి” తో మంచి కం బ్యాక్ ని తాను అందుకున్నాడు కానీ ఏపీలో మాత్రం ఈ సినిమాకి కొంచెం లాసులు అయితే వచ్చాయి.

మరి ఈ చిత్రం తర్వాత తాను “గీతా గోవిందం” దర్శకుడు పరశురామ్ తో రెండో సినిమా చేస్తుండగా ఆ సినిమానే “ఫ్యామిలీ స్టార్”. మరి ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొనగా ఈ సినిమాని ఎప్పుడో చిత్ర యూనిట్ అయితే సంక్రాంతి రేస్ లో రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు.

ముఖ్యంగా మాస్ మహారాజ రవితేజ “ఈగల్” నిర్మాణ సంస్థకి దిల్ రాజు బ్యానర్ కి ఉన్న ఏవో పాత లెక్కలతో వీరు ఎవరూ తగ్గం అన్నట్టుగా వచ్చారు. అయితే ఇప్పుడు విజయ్ సినిమాపైనే సినీ వర్గాల్లో కొన్ని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఎటూ చేసి ఫైనల్ గా విజయ్ సినిమానే వెనక్కి తోసేశారట.

నయా అప్డేట్ ప్రకారం ఫ్యామిలీ స్టార్ సినిమాని సంక్రాంతి రేస్ నుంచి తప్పించి వేసవి లో విడుదల చేసుకునేలా ఇప్పుడు ప్లాన్ లు చేంజ్ చేస్తున్నట్టుగా గాసిప్ లు వినిపిస్తున్నాయి. మరి దీనితో ఫైనల్ గా వెనక్కి తగ్గింది విజయ్ నే అంటూ ఫిక్స్ అయ్యింది. ఇంకా ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా విజయ్ సరసన నటించింది.