Movie Theaters : అభిమానుల నుంచి తమ తమ ధియేటర్లను కాపాడుకోవల్సి వస్తోంది ధియేటర్ల యాజమాన్యం. అదేంటీ.? ధియేటర్లు కళకళలాడాలంటేనే అభిమానులుండాలి కదా.. ఏంటీ కిరికిరి అనుకుంటున్నారా.?
అవును నిజమే.. అభిమానం తప్పు కాదు. కానీ, ఈ మధ్య అభిమానం పేరుతో ఫ్యాన్స్ చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. అభిమానం వెర్రితలలు వేస్తోంది. ధియేటర్లలో స్క్రీన్లు చించేయడం, ధియేటర్ సామాగ్రిని ధ్వంసం చేయడం.. ఇలా ఒక్కటేమిటి పిచ్చ పిచ్చగా రచ్చ చేస్తున్నారు.
స్టార్ హీరోల సినిమాలు వస్తే, ఈ పిచ్చి మరింత రెచ్చిపోతోంది. నచ్చిన సినిమా అయితే ఒకలా, సినిమా నచ్చకపోతే ఇంకోలా.. అభిమానం పేరుతో రచ్చ మాత్రం సేమ్ టు సేమ్ వుంటోంది. అందుకే, అభిమానుల బారి నుంచి తమ ధియేటర్లను కాపాడుకునేందుకు యాజమాన్యం తెగ పాట్లు పడుతోంది.
ఈ మధ్య ఓ చోట స్ర్కీన్ సేవ్ చేసుకునేందుకు స్ర్కీన్ డయాస్ వద్ద మేకులు కొట్టారు ధియేటర్ యాజమాన్యం. అలాగే రచ్చ చేసే అభిమానులు స్క్రీన్ దగ్గరకు వెళ్లకుండా ముళ్ల కంచెలు వేసి, సెక్యూరిటీ పెట్టుకున్నారు. పాపం యాజమాన్యం పాట్లు ఇలా వుంటే, అదిగో మమ్మల్ని అవమానిస్తున్నారు.. అంటూ మరోలా రచ్చ మొదలెట్టారు అభిమానులు.
ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ సినిమా వస్తోందంటే, ఓ కంట ఆనందం, మరో కంట విషాదం.. అన్నట్లుగా టెన్షన్ మొదలైంది ధియేటర్ అభిమానులకు. అసలే భారీ సినిమా. ఇద్దరు స్టార్ హీరోలు. వేర్వేరు ఫ్యాన్ బేస్ వున్న హీరోలు. సో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో ఈ టెన్షన్ ఇంకాస్త ఎక్కువే అయ్యింది పాపం ధియేటర్ యాజమాన్యానికి.
యాజమాన్యం పాట్లు.. నచ్చితే ఓ రకంగా. నచ్చకపోతే ఇంకో రకం.. సంబరాల పేరుతో ఈ పాట్లు.. స్రీన్లు తగలెట్టేస్తున్నారు. ధియేటర్‌లో రచ్చ చేస్తున్నారు.