Big Boss Non Stop: బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన షన్ను… రచ్చ మామూలుగా ఉండదు!

Big Boss Non Stop: బిగ్ బాస్ కార్యక్రమం చూస్తుండగానే చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలోనే హౌస్ లోకి బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కంటెస్టెంట్ లు ఎంట్రీ ఇస్తూ ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించేందుకు హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో కంటెస్టెంట్ లకుగేమ్ ఆడించి సందడి చేశారు. ఇప్పటికీ బిగ్ బాస్ కంటెస్టెంట్ లు మానస్, సిరి, రవి బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి ప్రేక్షకులను తమదైన శైలిలో సందడి చేశారు. ఇకపోతే ఈ ముగ్గురు బిందు మాధవి, బాబా భాస్కర్, అనిల్ పోటిదారులుగా ఎంపికయ్యారు.

ఈ క్రమంలోనే షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లతో ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ కంటెండర్స్‌ గేమ్‌ ఆడించారు. అఖిల్ కు మిస్టరీ బాక్స్‌ రాగా అందులో ఎక్కువ పాయింట్స్‌ ఉన్నవాళ్లే గేమ్‌లో ముందుకు వెళ్లాలని రాసుంది. మరి ఈ కంటెండర్స్ గేమ్ లో భాగంగా అఖిల్ ఫ్రీ పాస్ అందుకుంటారా లేదా శివ అందుకుంటారా అనే విషయం తెలియాల్సి ఉంది.ఇకపోతే షణ్ముఖ్ జస్వంత్ ఎన్నో వెబ్ సిరీస్ లో నటించి మంచి గుర్తింపు పొందారు.

ఈ క్రమంలోనే బిగ్ బాస్ సీజన్ ఫైవ్ కార్యక్రమానికి వెళ్ళిన షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ రేసులో ఉన్నారు.తప్పకుండా షణ్ముఖ్ జస్వంత్ టైటిల్ అందుకుంటారని అందరూ భావించారు. అయితే షణ్ముఖ్ జస్వంత్ క్లోజ్ గా మూవ్ అవుతూ గేమ్ పై కాన్సెంట్రేషన్ తగ్గించడం వల్ల ఆయన కేవలం రన్నర్ గా మాత్రమే మిగిలిపోయారు. ఇలా రన్నర్ గా మిగలడమే కాకుండా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున నెగిటివిటీ మూటగట్టుకున్నారు.